పుట:Srinadhakavi-Jeevithamu.pdf/65

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
58
శ్రీ నాథ కవి


సంతోషించి సర్వవిధములఁ గవివర్యునకుఁ దోడ్పడుదురనుటకు సం దే హముండునా? ఉండదు. ఒక వేళ ఘోడె రాయభీ మేశ్వరస్వామి మత గురువై యుండిన నుండవచ్చును గాని విద్యాగురువని మాత్రము తలం పరాదు. శ్రీనాథుఁడు నేర్చిన దొక్క విద్యగాదు; ఒక్క వేదము కాదు; ఒక్క శాస్త్రము గాదు; ఒక్క కవిత్వము గాదు; ఒక్క పురాణముగాదు; ఒక్క నాకటము కాదు; ఒక మత తత్త్వముగాదు. ఇతఁడు నేర్చినవిద్యలు పెక్కులుగలవు. అన్ని వేదములను బఠించెను; అన్ని శాస్త్రముములనబ్య సించేను. చతుర్విధ కవిత్వములను జెప్ప నేర్చెను; బహుపురాణములను బరించెను. అనేక నాట కాలంగా కారాసాహిత్య సంపత్తి యలవఱచుకొని యెను. ఆంధ్ర గీర్వాణవాణి వాని జిహ్వాగమున నిలుచుండి యను దినమును నృత్యము సలుపుచుఁ దనసమ్మోహనాస్త్రమ పాలుర సౌకర్షింపుచుండెను. ఇందునుగూర్చే శ్రీనాధుని భార్య తో బుట్టినవాఁడగు దగ్గుపల్లి దుగ్గయా యూత్యుఁడు తన నాచీకేతూ పాఖ్యా నములో తన బావ శ్రీనాథుని పొండి త్యాదుల నీకిందిప్యములో నభివర్ణించెను.

సీ. సంస్కృత ప్రాకృత గౌర సేనీ ముఖ్య భాషా పరిజ్ఞాన పాటవంబు
పన్నగపతిసార్వభౌమ భాషీత మహా భాష్య విద్యాసమ భ్యాసబలము
నక్ష పాదకణాదపక్షి లోధీరత న్యాయక లాకౌశలాతిశయము
శత పురాణాగ మస్మృతి సాంఖ్య దాత కబళన వ్యత్పత్తి గౌరవఁ బు

పూర్వక విముఖ్యవిన చితా పూర్వకావ్య
భావర ససు ఖాచర్వణ ప్రౌడతయును
గందళింపంగఁగాశి కాఖండ నైష
ధప్రముఖ వివిధ ప్రబంధము లొనర్చి.

హరవిలాసమున నవచి దేవయతిప్పయ సెట్టి,

“అఖలపు రాణవిద్యాప్రవీణు, నధ్వర్వు, వేదశాఖా తిధినిష్ణాతు,"

అని ఆగమజ్ఞాననిధివి, తత్వార్థ ఖనివీ, బహుపురా-జ్ఞుడవు" అని తన్ను గూర్చి పలికనట్లుగా శ్రీనాథుఁడే తేలుపుకొనియున్నాడు. మఱియును