పుట:Srinadhakavi-Jeevithamu.pdf/64

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
57
తృతీ మాధ్యాయము


గాదు. ఇందలి కమలాద్రి యెద్దిమో తెలియకున్న దని కుప్పుస్వాము య్యగారు వచించిరి.

శ్రీ నాథుడు భీమేశ్వర పురాణములో


సీ. కమలాచలా గ్రహక్కంటేయ శివ శిరశ్శశి చంద్రి కొధాత సౌధవీ
గోదావరీ పుణ్య కూలంకపాజుల స్ఫారిత శ్రీ ద్రపాదయుగళి
బలవదభ్యున్నత ప్రాకార పదివేప, గండూపీ, తాజాండకుండలంబు
గంధదంతావళి పైవ్రేయు ఘటికా కాంతారముఖర ఘంటాపధంబు

<poem>రాజ బింబననా నూత్న రత్న పేటి
వీర రాహుత్త సుభటకం నీనివాద్రి
వేమ భూపాల రాజ్యాభివృద్ధికరము
పౌండ్ర విభవంబు రాజుమద్ర పురము

అని కమలాద్రినిలయుఁడైన మూర్కండేయ శివుడు రాజమ హేంద్రపురములోని వాఁడని తెలిపినందునఁ గమలాద్రి రాజమహేంద్ర పురములోనిదే యని తేటపడుచున్నది గదా. కృతిపతియన్నయైన నేను భూపాలుని కృపావీక్షుణనును, కృతిపతి కులగురువైన ఘోడేరాయ భీమయలింగ పద సమారాధనమును సంప్రాప్తము గాకయున్నఁ దనకట్టి మహా భాగ్యము లభింపదు గావున శ్రీనాథుఁడట్లు వారినిఁ బస్తుతించు టయుగాక' యాపురములోన ముఖ్య దైవతము లైన నృసింహ,మార్కం డేయ శివులనుగూడ నావిధముగాఁ బ్రశంసించి యున్నాఁడు, ఇదంత యును గృతిపతిని వానియన్నను వానికులగురువును సంతోష పెట్టుటకై క్రీనాథుఁడు చేసిన వర్ణనముగాని నిజముగా ఘోడెరాయ భీమయ నీతనికి విద్యాగురునగుట చేతఁ జెప్పుకొన్నది కాదని సూక్ష్మబుద్ధి చేత మనము గ్రహించవచ్చును. శ్రీనాథుని ప్రతిఘటించెడి మత్సరగస్తు లైన పండితు లనేకు లారాజమ హేంద్ర పురఘున నుండుట చేత రాజాశ్రయమునకు దోడ్పడు వారి ప్రస్తుతి ముఖ్యముగా గంథమునం దుండవలయును. కానీ యడ్డ కాళ్లకు బందము తగిలించుట వంటిది. ఇట్టి స్తుతి పాఠములకు