పుట:Srinadhakavi-Jeevithamu.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

శ్రీ నా థ కవి


శింహస్వామి యను స్వయంవ్యక్తమూర్తి కలదు. ఆమూర్తి యనాదిగా రేచర్ల రాజులకు పాస్యముగా నుండెనట. దీనివలననే సింగమనా యఁడను నామములు వీరియింట నాకాలమునఁ డఱచుగా గలిగియుండె నని తోఁచుచున్నది." అని వ్రాయఁబడిన దానిని జదువ వేదాద్రి యిది యని తెలియవచ్చె, ఇందలి కమలాద్రి యెద్దియో తెలియకున్నది.”

ఇందు పైని పేర్కొనఁబకిన ఘోడి రాయ బిరుదాంచితుడైన భీమేశ్వరుడు దేవటివంశ్యులైన రెడ్డి రాజులకు వంశగురువు. ఈవిష యము "కాశీఖండములో

  ఈశ్వరుడింటి వేల్సు జగదేక గురుఁడగు ఘ డెరాయభీ
మేశ్వరుఁ డావం వంశశగుగుడీగులు నిత్యవినోద కృత్యముల్"
శాశ్వతధర్మ కీర్తులు దలంపఁగ సమ్మిన సొమ్ము లాదిగ
ర్బేశ్వరుడంట నైజ "మెనయే సృపు లళ్లయ వీర శారికిన్

అను పద్యమువలనను, శ్రీ భీమేశ్వరపురాణములో “రాయగురు పరమేశ్వర సాథుజనవి ధేయ ఘోడెరాయ సకల కళాధామాది బిరుద భాస్వరుండై భీమయ గురువరేణ్య పుణ్య కారుణ్యక టాక్షవీక్షణాలబ్ధ సుస్థిరైధుర్యుండై" అను వచనమువలనను విశద మగుచున్నది. ఇట్టి గురుపకు సమాధనము రాజమహేంద్రపురము నకు వచ్చిన పిమ్మట సంప్రాప్తమై యుండునుగాని యంతకుఁ బూర్వమే సంప్రాప్తమైయుండునని తోచదు. పై పద్యములోఁ బేర్కొనఁబడిన వేమారెడ్డి కృతిపతిని సింహాసనమెక్కించిన యన్న, భీమేశ్వరస్వామి కృతిపతి కులగురువు. కమలాద్రినిలయుఁడైన మార్కండేయ శివుఁడును, వేదాద్రి నరసింహుడును ననుదినమును గృతిపతిచే గొలుంబడుచుండెడి దేవులు. కమలాద్రీయు, వేదాద్రీయు, పుష్పగిరి శేషాద్రి మొదలగునవి రాజమహేంద్రపురములో గోదావరి తీరస్థ , ములై యున్న మిట్టలకు నామములు, శ్రీనాథుఁడు పశిశంసించిన "వేదాద్రి" కుప్పుస్వామయ్య గారు పేర్కొన్న హైదరాబాదు సీనులోని వేదాద్రి