పుట:Srinadhakavi-Jeevithamu.pdf/58

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
51
ద్వితీయాధ్యాయము


విలాసమును రచించి తిప్పయ పెట్టి కోరిక ననుసరించి యూతని కంకి తము గావించెననుట స్పష్టమగుచున్నది. మఱియు,

 మ. ఖుషిమీఱన్ సురదాణి నిండుకొలువై కూర్చున్నచో నీకరా
భ్యసనంబు న్నుతియిం చురాయవచితిప్పా! చంద్రసారంగ నా
భిసము త్పాదిత తాళవృంత పవన ప్రేంఖోలసప్రక్రియా
వసరోదంచిత సార సౌరభిర సన్యాలోల గోలంబముల్ .

అని వర్ణించియుండుటచేతఁ బై పద్యములోఁ బేర్కొనఁబడిన సురథాణి ఫిరోజషాహా 1422 వఱకుఁ బరిపాలను చేసినవాఁడుఁ గావున నాతఁడు హరవిలాసరచనా కాలమున బ్రతికియుండెనని చెప్పవచ్చును. కనుక హరవిలా సరచనా కాలము 'పెదకోమటి వేమా రెడ్డి మరణకాలము నకును, ఫిరోజిషా మరణకాలమునకును నడిమికాలమున అనగా 1421 వ సంవత్సర ప్రాంతమునై యుండునని నిర్ధారించుట కెవ్వియు నడ్డుకోనఁజూలవు. ఇంకను ఈవిషయము హరవిలాసమును గూర్చి వ్రాయు సందర్భమున సవిస్తరముగా విశదీక రింపఁబడును. [1]*

శ్రీనాథుని జన్మ కాలనీర్ణయము

హరవిలాసరచనా కాలము నిర్ణయమైనది గనుక నిపుడు శ్రీనాథునిజన్మకాలము 'దెలిసికొనట సుకరము కాగలదు. అవచి తిప్పయ సెట్టి తన్ను బాలసఖుఁడని ప్రశంసించినట్లుగా శ్రీనాథుఁడు హరక్షిలాసమున విశదపఱచి యున్నాడు. తిప్పయ పెట్టి వృద్ధుఁడై కాంచీపురములో సుఖుఁడై యున్న కాలమున బాల సఖుండవని ప్రశంసించుటచేత 'శీనాథుఁడు బాలుఁడుగా నున్న కాలమున వానితో మైత్రి గలిగినదని స్పష్ట

  1. * ప్రభాకర శాస్త్రి గారు తాము రచించి 1923లోఁ బ్రకటించిన శృంగార శ్రీనాథమను గెంథములో నా పాదము నే. ప్రవేశ పెట్టి ప్రథమ ముద్రణ గ్రంధమున "నేను - జెప్పిన కాలము నంగీకరించి బలపఱచియున్నారు,