పుట:Srinadhakavi-Jeevithamu.pdf/53

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
46
శ్రీనాథ కవి


పుత్రుడగు రామమాధవరావు కాలమునాటి శాసనమున, రసార్ణ వసుధాకర గ్రంథము మొదలగువాని వలనఁ దెల్లమగుచుండ నా కాలమున శ్రీనాథుడు లేఁడనుట స్వవచన 'వ్యాఘాతము కాదా? శ్రీనాథుఁడు పదవతరము సర్వజ్ఞ సింగమనాయని సందర్శింపఁ బోయి యాతనిపై బద్యములు చదివినది వాస్తమని సిద్ధాంతము చేయవల వలసిన పక్షమున లక్ష్మణరావుగారు శ్రీనాథుని జన్మకాల సంవత్సరమని నిర్ణయించి 1360 దవ సంవత్సరమును గాని వీరేశలింగముగారు నిర్ణ యించిన 1465 దవ సంవత్సరమును గాని మన మంగీకరింప రాదు. సర్వజ్ఞ సింగమనాయని కధను లక్ష్మణ రావుగారు విశ్వసించుచున్నారో లేదో మనకుఁ దెలియరాదు. వీరేశలింగముగారు విశ్వసించుచున్నారు. శ్రీనాథుని జన్మకాలమును నిర్ణయించునారు. హరవిలాసమును మాత్ర మెత్తుకోని తక్కిన విషయములను విస్మరించుట కూడదు. లక్ష్మణ రావుగారు హరవిలాసమును బట్టియే కాలనిర్ణయమునకుఁ బూనుకొన్నం దునఁ బైన చెప్పి నరీతిగా విపరీతసిద్ధాంతము లేర్పడుచున్నవి. బాలసఖుఁ డను దానిని వీరేశలింగముగారు గాని లక్ముణరావుగారు గాని తృప్తి కరముగా సమన్వయింప లేదు. ముప్పదియై ద్వేడ్లవానిని బాలునిగా జెప్పి, వానికిని వృద్ధుడైన తిప్పయకును సమావేశమును గలిగించి, సఖ్యతఁ గావించి, మఱి పదియేడ్లకు రప్పించి, బాలసఖుఁ డనిపించి, కృతినిప్పించినట్టి వీరేశలింగము గారివాదము యొక్క పటుత్వమంత తృప్తికరముగాఁ గానంబడదు. ఒక చోట వీరేశలింగము గారు, ఈనైషధ కావ్య రచనవలన శ్రీనాధున కాంధ్రకవులలో నత్యంత ప్రసిద్ధి కలిగినది. ఎంతటి ప్రసిద్ధిగలిగినను శ్రీనాథుఁ కింతవఱకు రాజస్థానములలో బ్రవేశము కలిగినది కాదు.ధనార్జనమునకై పెదకోమటి వేమనృపా లుని సంస్థానమునకుఁ బోయి యతని మంత్రులు మొదలైనవారి నాశ్రయించినట్టే శ్రీనాథుఁడు స్వస్వస్థలమును వచ్చిన యారంభదరి