పుట:Srinadhakavi-Jeevithamu.pdf/51

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
44
శ్రీనాథ కవి

ములైన యాయువీయకున్న వారి యుదారస్వభావమునకు వెలితిగనపట్టదా హరవిలాసములోని,

"శ్రీపర్వత సోపాన స్థాపక వేమ క్షతీశ సామ్రాజ్య శ్రీ న్యాసాల ముఖ్య యశ్వయ దీపిక యలకాది రాజ దేవయ తిప్పా,

అనుపద్యమును గూర్చి వీరేశలింగముగారు

"అంతేకాక తృతీయాశ్వాసొరంభములోని యీపద్యము తిప్పయసెట్టి కూడ పోలయ వేమా రెడ్డి కాలములో నుండినట్టు తెలుపుచున్నది. పోలయ వేమారెడ్డి కాలములోనే తిప్పయ్య సెట్టి వ్యాపారి ముఖ్యుం డైనందున నప్పటి కిరువది సంవత్సరములవాడయిన నాయియుడి, కుమారగిరి రెడ్డి రాజ్యారంభ కాలమునకే, 'యేఁబది సంవత్సరములవాడయి, హరవిలాసరచన కాలమునకే యజువదేండ్లు దాటిన వాఁడయి యుఁడవలెను. హరవిలాసము 1440 వ సంవత్సర ప్రాంతమున తిప్పయసెట్టికి కంకితము సేయఁబడినదని చెప్పెడి బుద్ధిమంతుల యభిప్రాయము ప్రకారము తిప్పయ సెట్టికి నూటపది యేండ్లు దాటిన తరునాత శ్రీ నాధుఁడు హరవిలాసము నంకితము చేసెనని యేర్పడును గనుక నది గొప్పయ సంగతము. కాబట్టి హరవిలాసము కుమారగిరి భూపాలుఁడు జీవించియుండ గానే 1890వ సంవత్సరమునకు లోపలనే తిప్పయ సెట్టి కంకితము చేయఁ బడుట నిశ్చయము. అప్పటి కే తిప్పయ శెట్టికి దాదాపుగా డెబ్బది సంవత్సరముల యీడుండును.1360 వ సంవత్సరములోపల జనన మొందిన శ్రీ నాధుఁడు వృద్ధుఁ డైన తిప్పయ శెట్టికి బాలసఖు డెట్లగును. ఇద్దరును సమాన వయస్కులు కాకపోవుట నిశ్చయము. తిప్పయ సెట్టి వృద్ధు డే శ్రీనాధుడు బాలుడై యుండినప్పుడు సఖ్యము కలిగియుండుట చేతనే తిప్పయ పెట్టికి శ్రీనాధుఁడు బాలసఖుడయ్యెనుగాని యుభయులును 'బాలు రైయుండి నప్పుడు కలిగిన మైత్రి చేత గాదు.....................కాఁబట్టి 1360