పుట:Srinadhakavi-Jeevithamu.pdf/5

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మొదటికూర్పు పీఠిక.

శ్రీనాథమహాకవి యేనూఱు సంవత్సరములకుఁ బూర్వమున నున్నవాఁడు. ఉత్త మాంధ్రకవులలోఁ బరిగణింపఁదగినవాఁడు. కర్ణాట సామ్రాజ్యాధీశ్వరుఁడగు ప్రౌఢదేవరాయ సార్వభౌముని మౌక్తికా గారమునఁ గనకాభిషేకముఁ గాంచిన కవిసార్వభౌముఁడు

వీరేశలింగముగారు ఏవిధమైన ఋజువుభారమును వహింపక గాలికబుర్లను పోగుచేసి యేనూఱు సంవత్సరములగుఁ బూర్వమున నున్నవాని వర్తనమును తాము ప్రత్యక్షమునఁ దమ కన్నులతోఁ జూచినట్లుగా స్త్రీలోలుఁడై వయఃకాలమున విచ్చలవిడిగాఁ దిరిగి కాయమును ధననికాయమును జెడఁగొట్టు కొన్న మహా పాపి యని నిందించుటయే గాక యాతని కాలమునాటి యాంధ్ర హిందూసంఘము జూరత్వమును ప్రతిష్టావహమైనది గను, శ్లాఘ్యమైనది గాను భావించునంతటి దౌర్భాగ్యస్థితి యందుండెనేని యేమో దూషించి నిర్హేతుకముగా ద్వేషబుద్ధిని బూని దురభిమానపూరితములైన యుక్తి రహిత దూషణ భాషణములచేఁ దమ యాంధ్రకవుల చరిత్రములోని శ్రీనాథకవి జీవితము నంతయు గళంకపఱిచి యున్నారు. ఇది యెంతయు సంతాపకరమైన విషయము. ఆశాపరుఁడై , అర్హసంభావనలకై , స్వార్థము తీర్థము కలసివచ్చుటకై, త్రిమ్మరియై జారుడై, దేశములు తిరిగి దేహమున ధనమును జెడఁగొట్టు కొని కష్టపడివలసిన వృద్ధదశను దెచ్చుకొని దిక్కు లేక చచ్చినట్లుగా దేల్చినట్టి వారివ్రాఁత వైఖరిని జూచినప్పుడు నాకుం గలిగిన పరితాపమునకు మేర లేకుండెను. ఎనుబది తొంబది యేండ్లు నిండి కాఁటికిఁ గాళ్ళు చాచుకొన్న ముసలితొక్కు శ్రీనాథుని వంటి శివభక్తాగ్రేసరుఁడు, వేదాంతి కస్తూరి కొఱకు, రత్నాంబరముల కొఱకు నంగలార్చుచుఁ బ్రాణములు విడిచి నాఁడని చెప్పెడి పద్యమును విశ్వసింప వచ్చునన్న జ్ఞానము యొక్క తత్వము డెబ్బ దేండ్లు వయస్సు చెల్లిన వయోవృద్ధులును, ప్రపం