పుట:Srinadhakavi-Jeevithamu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

శ్రీనాథకవి


హరవిలాసమును బట్టి భీమఖండమును 92 వ సంవత్సర ప్రాయ మునను, కాశీఖండమును 95 - వ సంపత్సర ప్రాయను రచించి నట్లు సిద్ధాంతము చేయవలసియుండును. శ్రీనాధుని మరణ కాలము లక్ష్ముణ రావుగారు వక్కాణించిన 1440 సంవత్సర ప్రాంత మే సత్యమైన దైన యెడల శ్రీ నాధుఁడు102 సంవత్సరములును, శ్రీ వీరేశ లింగముగారి యభిప్రాయము ప్రకారము: శ్రీనాథుఁడు సాళ్వనృసింహ రాజు రాజ్య కాలమునఁ గూడ నుండుటయే వాస్తవమైన యెడల 115 సంవత్సరములును, హరవిలాసమును బట్టి శ్రీనాథునకు తిప్పయ బాల్య సఖుఁడే యైన యెడల 122 సంవత్సరములును, పదవతరము వాఁడై న సర్వజ్ఞ సింగభూపతిచే సన్మానంపఁబడిన నాఁడే యైన యెడల 132- సం వత్సరములును దీర్ఘాయుష్మంతుఁ డై జీవించియుండునని సిద్ధాంతము చేయవలసి యుండును. ఇంకొక నూర్గమును బట్టి చూతము.

నాచీకేతూపాఖ్యాన కావ్యకర్త యగు దగ్గుబల్లి దుగ్గనామాత్యుఁడు శ్రీనాథుని భార్యతోఁబుట్టినవా డని నాచి కేతూ పాఖ్యానములోని,

సీ, కవిస్వాముఁ డై కర్ణాకవిమల చేత :
గనకరత్నాభిషేకములు గనిన
శ్రీనా ధకవి కూరిమి చేయుమఱదిని
డుగ్గాయ కవి రాజు దగ్గుబల్లి
తిప్పనార్యునకు సతీమణి యెట్టకు
కుసుఁ తనూజు డవు పోతనకునెఱ
నామాత్యవరునకుననగు దమ్మండవు
శాండిల్య గోత్రుడ ససమతివి

గీ. చెప్ప నేర్తువు కృష్ణులు బుస్థిరము గాను
గాన నీవు రచింపంలం గడగియున్న
నాచికేత చరిత్రంబు నాదు పేర
నంకితము సేయు కవిరాజు లాదరింప