పుట:Srinadhakavi-Jeevithamu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

39

ద్వితీయాధ్యాయము


స్సుండ వలయునుగదా. దీనింబట్టి కాలనిర్ణయము చేయఁ బూనినయెడల తిప్పయ పెట్టి 1330 దవ సంవత్సర ప్రాంతమున జనించి యుండవలయు ను. లక్ష్మణ రావు గారి యభిప్రాయ ప్రకాశ మేడెనిమి దేండ్లు శ్రీనా థుడు తిప్పయకంటె చిన్న వాఁడు. గావున, శ్రీనాథుడు 1338 వ సంవత్సర ప్రాంతమున జనించియుండ వలయునుగాని లక్ష్మణ రావుగారు చెప్పిన చందమున శ్రీనాథుని జనన కాల సంవత్సరము 1360 కోబో దు. శ్రీ వీరేశలింగముగారు చెప్పిన చందమున శ్రీనాథుని జనన కాల సంవర్సరము 1365 కాఁబోదు. అనగా హరవిలాసరచనా కాలము ప్రకారము 1400 సంవత్సర మేయైన యెడల నప్పటికి వారునిర్ణయించిన దిప్పయకు 70సంవత్సరములు, శ్రీనాధునకు 62 సంవత్సరములును వయస్సు గలిగి యుండవలయుననుట హరవిలాసము ప్రకారము సిద్ధాం తమగుచున్నది గాని లక్ష్మణ రావుగారు చెప్పిన ప్రకారము తిప్పయకు నే బ బేండ్లుగాని శ్రీనాధునకు నలున దేండ్లుగాని, వీరేశలింగముగారు చెప్పిన ప్రకారము శ్రీనాథునకు ముప్పదియైదేండ్లు గాని వయస్సుగలిగి యుందురన్న సిద్దాంతము నిలువజాలక పోవుచున్నది గదా! భీముఖండ రచనా కాలము లక్ష్మణ రావుగారు చెప్పినట్లు 1420 దవ సంవత్సర మును కాశీఖండరచనా కాలము గర:1430వ సంవత్సరమునైన యెడల శ్రీ నాధుఁడు తన 52 సంవత్సర ప్రాయమున భీమఖండమును 92 వ సంవ త్సర ప్రాయమునకాశీ ఖండమును రచించినట్లును హరవిలాసమును బట్టి సిద్ధాంతమగుచున్నది. వీరేశలింగము గారు చెప్పిన చందమున భీమఖండరచన కాలము 1430 దవ సంవత్స రముడు, కాశీఖండరచన కాలము 1435 దవ సంవత్సరము నైనయెడల శ్రీ నాథుఁడు భీమఖండమును 65 వ సంవత్సర పాయమునను, కాశీ ఖండమును 70 దవ సంవత్సర ప్రాయమునకు, ఇరువురును. బాల్య సఖులై శ్రీ నాథుఁ డేఁడెనిమిది సంవత్సరములు చిన్న వాఁడైన పక్షమున