పుట:Srinadhakavi-Jeevithamu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

శ్రీనాథకవి


చెప్పుకొనుటచే గృతి నందు నాటికి 65 సంవత్సరముల వయసువాఁడై యుండును. ఇతనికి బాలసఖుడగు శ్రీనాథుఁడును 50 సం॥ వయసువాడై యుండును.[1]*

లక్ష్మణ రావు గారి యభిప్రాయమః ప్రకారము తిప్పయ సెట్టి శ్రీనాథునికంటె నేఁడెనిమిదేండ్లెక్కువ వయస్సు గలవాఁడు. అనఁగా 1352 వ సంవత్సరమునఁ దిప్పయసెట్టి జనియించియుండనయును. శ్రీల క్మణ రావు గారి పద్ధతిని మన మనలంబించిన యడల తిప్పయు సెట్టి వయ స్సు నిశ్చయముగా మనముఁ "జెలిసికొనుటకు మార్గ మాహరవిలాసము సందే గలదు. తిప్పయ సెట్టి తండ్రియగు దేవయ సెట్టి,

క. శ్రీపర్వత సోపాన తసోషాన
స్థాపఁడగు రెడ్డి వేమ జగతీ పతికిన్
బ్రాపైన యవచిదేసయ
యాపావాణికి జనించె సభ్యుదయముతోన్,

అని పోలయ వేమా రెడ్డికి బ్రాపు గానుండెననుటకును 'బై పద్య
మునఁ జెప్పియున్నాడు. మఱియును,

క. శ్రీపర్వత సోపాన
స్థాపక వేసక్షితీశసామ్రూజ్య శ్రీ
వ్యాపారి ముఖ్య యస్వయ
దీపక యలకాధి రాజ 'దేవయుతిప్పొ.

అని చెప్పియుండుట చేతఁ గూడ అప్పయ పెట్టి 'పోలయ వేమక్షితి నాథుని కాలమునఁగూడ వ్యాపారి ముఖ్యుఁడుగా నున్నట్లు 'దెలిపియు న్నాడు. శ్రీ పర్వతసోపానస్థాపకుఁడై వన్నె కెక్కినవాడు పోలయ వే మారెడ్డి గా"ఫున నతఁడు 1350 దవ సంవత్సరము వఱుకును బరి పాలనము చేసినవాడు. అతని రాజ్య పరిపాలన కాలములో వ్యాపారి ముఖ్యుడుగా

నుండుటకుఁ దిప్పయ సెట్టికీ గనీస మిరువది సంవత్సరములయిన వయ

  1. వావిళ్ళ రామస్వామి , శాస్త్రీ అండ్ సన్సు వారిచేఁ బ్రకటిత మైన ప్రతి (1916)