పుట:Srinadhakavi-Jeevithamu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

శ్రీనాథకవి


రముల వయస్సు నిప్పించుట వీరి యుదారస్వభానమును తేటపఱచక మానదు. ఈచరిత్రమున నిట్టి విచిత్రవిషయము లెన్నెన్నో పొడఁగట్ట గలవు. వాని ప్రశంస యిప్పటికి నిలుపుదము. కమలనాభుఁ నెంత కాలము బ్రదికి యుండెనో మనము చెప్పజాలము. మనకుఁ దెలియ నప్పు డొకనిఁ బండితపుత్రు డని వెక్కిరించుటయు సంభావ్యము గాదు. " కమలనాభుఁడు గాని సూరయగాని కరణములనీ చెప్పుటకుఁ బ్రమా ణము లేనప్పుడు అతఁ డాగ్రామకరణమగుటచే సౌతని పుత్రుడును శ్రీనాథుని తండ్రియునగు మారయయు నాగ్రామమునందే యుండి కరిణిక పువృత్తి చేసి జీవనము చేయుచు నుండియుండవచ్చునని వ్రాయుట విశ్వాసపాత్రమైన వ్రాతకాఁబోదు. తన తండ్రి తాతలు కరణము "లేయై నిజముగాఁ గరిణిక పువృత్తినలస జీవించువారే యైనయెడల శ్రీనా థుఁడు గూడు వంశపారంపర్యపు హక్కును విడనాడుకొ"ని యుండఁడు. ఆ విషయమును బహిరంగముగాఁ జెప్పకపోయినను పరోక్షముగా నైనను దా నేదో పట్టణమునకుఁ బ్రభువునని యే చెప్పుకొనియుండును. అట్లు చెప్పుకొని యుండసందున నతని తండ్రి తాతలు కరణములని యూహిం చుట యుక్తముకాదు. మన మేది మూహించి చెప్పినను హేతు యుక్తమై యుండవలయును.

భీమేశ్వరపురాణకృతిభర్తయగు 'బెండపూడి అన్న మంత్రి తాతయగు అన్నమంత్రిని:-

<సీ!! కాకతీక్ష్మపాల గుంధదంతావళి
ధ్వజునీమహాధురంధరుడనంగ
నవలక్ష కోదండ నాధ రాజ్యాంబోధి
సద్వరపూర్ణిమా చంద్రుఁ డనఁగ
నాంధ్రభూమండలాధ్యక్షు సింహాసన
సంప్రతిస్థాపనాచార్యుఁ డనఁగ