పుట:Srinadhakavi-Jeevithamu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

27

ప్రథమాధ్యాయము


.

మో?* అని పరిహాసముగ నక్కాణించు చున్నారు. పండిత పుత్రుఁడను మాట నటుండనిండు. రెండవ ప్రతాప రుద్రుఁడు 1323 వ సంవత్సర మువఱకును రాజ్య పరిపాలనము చేసినవాఁడు గావున నప్పటికీఁ గమల నాభుఁడు ముప్ప దేండ్ల వయస్సు గలవాఁడై యుడవలయును. శ్రీవీరేశ లింగముగారు చెప్పినట్లు 1380 వరకు గమలనాభుఁడు బ్రతికికయుం కుటయే నిశ్చయమైన యెడల కమలనాభునకప్పటికి 87 సంవత్సరము లైన నుండును.ఏవిధ మైన లిఖితమూలక సౌక్ష్యమును లేకుండఁ గమల నాభుఁ డంత కాలము జీవించి యుండెనని విశ్వసించుట క్రమమైన పద్ధతి 'కాఁజూలదు. మఱియును అన్నమంత్రి 1430 వ సంవత్సర ప్రాంతమున నున్న వాఁడు గావున నప్పటి కాతని కేబదేండ్లున్నవని యొప్పు కొన్నను 1380 సంవత్సర ప్రాంతమునఁ బుట్టి యుండవలయును గావుకఁ గమలనాభునితో అన్న మంత్రికి స్నేహము గలదని కాని, అతఁడు కమలనాభుని నెఱింగియున్నవాడనివిశ్వాసపాత్రము గాదు, ఇంకొక చిత్రము చూడుఁడు. వెల్గోటివారి వంశములోఁ బదవపురుషుడైన సర్పజ్ఞ సిం గనాయని సభకుశ్రీనాథుఁడు 1425 దవసంవత్సరమునఁ బోయి.యుండెనని శ్రీవీరేశలింగముగారు వ్రాసి యున్నారు. ఆఱవరుషుఁ డైన ఆన పోతనాయఁడు 1381 సంవత్సరమువజకు బ్రదికియున్నట్లు శానసములు నిరూపించుచున్నవి. 1425 దవ సంవత్సరము నాటికి సర్వజ్ఞ సింగమ నాయనికి 25 సంవత్సరములు వయస్సు కలదనుకొన్నను, (కనీసప శము) అతఁడు 1400 సంవత్సర ప్రాంతమున జన్మించి యుండును గదా! ఏఁడవపురుషుఁడు 1400 వఱకు బ్రతికి యున్నాడనుకొన్నను, ఎనిమిదవ తొమ్మిదవ పురుషు లేమైరి? శ్రీనాధుని సర్వజ్ఞ సింగమనాయుని సభకుఁ గొనిపోవుటకై వెల్గోటివారి వంశములో రెండు పురుషాంతర ముల నంతరింపఁ జేసినవా రొక్క సారిగా శ్రీనాథుని తాతకు 87 సంవత్స