పుట:Srinadhakavi-Jeevithamu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

శ్రీ నాథ కవి


శ్రీనాధుని తాత.

"కమలనాభుని మనుమఁడ వమలమతిని " అనుటచేఁ గూడ నొకవిశేషము గలదు. శ్రీనాథుని తాతయగు కమలనాభుఁడు గూడ అన్నమంత్రికి జుట్టమనియుఁ బరిచితుఁడనియు దేట తెల్లముసేయ చున్నది." అని యాంధ్రుల చరిత్రము మూఁడవభాగములో వ్రాసియున్నాను. అన్నమంత్రికి గమనాభుఁకు పరిచితుఁడనుట పొరబాటు.ఆయర్థ మిందు లేదు. కమలనాభుఁడు ప్రసిద్ధపురుషుఁడై నందున నూరక కమలనాభుని మనుమఁడ, వని వక్కాణించి యున్నాఁడు. కమలనాభుఁడు బహుసంవత్సరములు జీవించి యుండవచ్చును గాని అన్న మంత్రియును, శ్రీనాథుఁడును, కమలనాభుఁడు బ్రతికియుండగాఁ బుట్టియుండిన నుండవచ్చును గానీ కమలనాభుని వీడు బాగుగా నెఱిఁగియుందురనుట సంశయాస్పదమైన విషయము. ఆంధ్రు లచరిత్రము . మూడవ భాగములో, బరిచితుఁడని నేను వ్రాసినదానిని బురస్కరించుకొని శ్రీవీరేశలింగముగారు. పరిహాస భాజనమగునట్లుగా నూహా ప్రపంచమును విస్తరింపఁ జేసి నేఁడిట్లు వ్రాయుచున్నారు. " తాతయే శ్రీనాథునకుఁ జిన్నప్పుడు విద్యయుఁ గవిత్వమును నేర్పియుం డును. భీమఖండకృతిపతి కమలనాభుని నెఱింగియుండినట్టు చెప్పుటచేత సతఁడు.. 1365 వ సంవత్సరమునకై బదికీ యుండవచ్చును. అప్పటికి శ్రీనాథునికి తప్పక పదు నేను సంవత్సరములకుఁదక్కువకానియీడుండును.దానినిబట్టి శ్రీనాధుఁడు 1365 వ సంవత్సర ప్రాంతమున జనన మొంది యుండును. "


మఱియును వీరు కమలనాభుని శ్రీనాధునికి గురువును గాఁ జేయుటకై శ్రీనాధుని తండ్రిని పండితపుత్రుని గావించిరి. శ్రీనాధుఁడు తనతాతసు గూర్చియె కాని యేపుస్తకము నందును తండ్రిని గూర్చి యంతగాఁ జెప్పియుండక పోవుట చేత' “అతఁడొక వేళ పండితపుత్రుడే యే