పుట:Srinadhakavi-Jeevithamu.pdf/32

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ప్రథమాధ్యాయము


అదియును గాక ఆంధ్ర దేశమునఁగల ఆర్వేల నియోగులలో పాకనాటి నియోగి శాఖకూడ గలదని మనవాజ్మయమే సాక్ష్యమిచ్చు చున్నది. కృష్ణ రాయ విజయమును రచించిన కుమారదూర్జటి 'పాక నాట్యా ఱవేల వంశప్రసిద్ధులి' అని చెప్పుకొని యున్నాడు. కావున : పాక ' నాటింటివాడవు' అను వాక్యమునకు పాకనాటి నియోగిశాఖా బ్రాహ్మ ణుఁడవు' అను నర్థమే చేసికోవలెను. ప్రసిద్ధాంధ్ర చరిత్ర కారుఁడట్లే వ్రాసెను. శ్రీ ప్రభాకర శాస్త్రుల వారట్లే వ్రాసిరి. దీనికి 'వేఱొక యర్ధము సందర్భశుద్ధి లేక కల్పించుట పరిహాసాస్పద మైనపని."

మరియు 'భక్తానంక కల్పదుమ' ప్రబంధ కారుఁడును పాకనాటి బాహ్మణుఁడు బాపి రాజకవి తనగద్యములో నిట్ల వ్రాసికొన్నాడు .

"ఇది శ్రీ మహా దేవ కాళీ వర ప్రసాదలబ్ధ సకలజనమత సమ్మత స్తుతవిహాయత ధౌరేయ నిరంతరోద్గాఢార్ధ సౌందర్య తాత్పర్య మా ధుర్య శబ్ద గుంభనాలంకార ప్రేకానుగుణ్య ప్రకటనటన నానా దేశా న్విత భాషా కవి తాంధ్ర గీర్వాణ ఘటి కాశత గండకల్పక విద్వజ్ఞ నాహ్లాదకర పొకనాటి శేష్ఠ పరాశరగోత్ర శివపూజు దురంధర షట్సహస్ర నియోగి రత్నాకరశంక పరమ పతివ్రత తుల్యాచ్చ మాం బాధ వేశ్వరవదప్ప రాజాబ్దిసుధాకర (దివాకర రాజు శేషా చలా నులావతి,)వేంకమాంబాసుత బాపిరాజు ప్రణీతం బైన భక్తానంద కల్ప ద్రుమంబను ప్రబంధంబునందు ప్రథమాశ్వాసము. "

ఇంకఁ 'బాక నాటి నియోగియగు శ్రీనాథుని బావమరదియగు దగ్గుబల్లి దుగ్గనామాత్యుని నియోగి యని చెప్పుటకు నామిత్రునివలె

నెవ్వరును సంశయింపఁ బనిలేదుగదా.*[1]

  1. * A Triennial Catalogue of Manuscripts. Telugu.vol III, part III, R, No. 316, page, 933.