పుట:Srinadhakavi-Jeevithamu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథకవి

సీ||వినుపించిన వాడవు వేమ భూ పొలువ కలపురాణ విద్యాగమములు కల్పించి నాఁడవు గాజపాకు బైన హర్ష నైషధ కావ్యమాంధ్ర భాష భాసించి నాడను బహు దేశభుదులతో విద్యాపరీక్షణ వేళలందు వేదజల్లి నాడవు ఒకరకర్త స్ఫూర్తి.. కర్పూములు దిశాంగణములందుఁ పాక నాటింటి వాడవు బాంధవుడవు కమలనాభుని మనుమడ విమలదుతివి నాఁ గృపసేయు మొక ప్రబంధంబు నీవు క లితగుణగణ్య శ్రీనాథకవివరేణ్య .

శ్రీనాధుఁడు 'పెదకోమటి భూపాలుని మరణానంతరము రాజమహేంద్ర వర రాజ్య మునకు వచ్చుటకుఁ గారణము లేమి? అచ్చట వేమ వీరభద్రనర పా లకులకు సచివగ్రామణియై, పండిత పోషకుడై, బాంధవుడై, యున్న బెండపూడి అన్న మంత్రి తనకర్హసత్కారము లోసంగు ననియె. అన్న మంత్రి కృతిభర్తయై శ్రీ నాధుని పాకనాటింటి వాడవు బాంధవుఁడవు' అని హెచ్చరించుటఁ గనినచో ఆపద్య పాదమున కిట్లర్గము చేసికొన వలెను:

«« నేను కృతిభర్తను, నీవుకృతిక ర్తవు; మనమిరువురము ఒక్క టియే శాఖవారము, మీదుమిక్కిలి బంధువులము.” ఇచ్చట వారివారి స్వశాఖాభిమానమును ప్రస్ఫుటము చేయుచున్న వాక్యరత్నములే కాని మీ యింటి పేరు పాకనాటివారు, మీరును, మేమును బంధువు లము” అని యర్ధమిచ్చు మాట లెంతమాత్రమును గావు. దూర దేశ మునఁ గలుసుకొన్న శాఖాభిమానమువలన గలిగినలాభమే శ్రీ నాధుని నట్లు వ్రాయుటకుఁ బురికొల్పినది.