పుట:Srinadhakavi-Jeevithamu.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముగా నెఱింగి యచటి రిగి\

ద్రమహా రాజుగారి యుంపుడు కత్తెయగు మాచల్డేవియను వేశ్యాంగన చిత్రశాలా ప్రవేశముఁ గావించుచుఁ జేయునట్టి పుణ్యాహవచన సమయముగా కొంత కాలమచట నిలిచి యామహారాజులాలించు నాకళావతిని సందర్శించి కొంత తడవు సుచిత్ర సంభాషణ బులుసలిపి మంచనశర్మడగు పూర్వపువారాంగన యుగు గాంధారిగన్పట్లగా నామె కడ గొంత తడవు విశ్రమించి మరల బయలు దేఱి నాగసర్వమునఁ బాడుచున్న నాగుల వానిని 'మెచ్చికొనుచు నటుపిమ్మట పొట్టే ళ్ళపందెములను, గోడిపందెములను గాంచి సంతోషమును జెందుచు నా వెనుక నావిట శేఖరుసకుఁ బ్రియులగు కామమంజరి గృహముఁ బ్రవేశించి యాఱేయి యచట యధేచ్ఛముగా గడపి గడపి తరువాత తమ మార్గమునం బోయిరి.


ఈగ్రంథమంతయుఁ గ్రీడా విషయములతో నిండియున్నది. జన సామాన్యము యొక్క సంఘజీవిత మంతయును మహానగరములలోను, మహాపట్టణములలోను. ప్రాయకముగా విశాలమై గంపట్టుచుండును , ఇట్లు నానావిధ జాతుల యొక్కయు, మతముల యొక్కయు, వర్ణముల యొక్కయు, నిమ్నోన్నతావస్థలును, సుగుణ దుర్గుణరూప భేదములు, శీల భేదము లను అవస్థా భేదములును మహానగరములలో నొకేస్థానమున నొకేకాలమునఁ జూచుట కెక్కువయవకాశ ముండును. ఈవివిధ రూవమానవ ప్రకృతిఁజూచిన ప్రతిమానవునకుఁ గొంత సంతోషముగలుగక మానదు,


సమర్ణుఁ డైనకవి యట్టి వివిధ మానవ ప్రవృత్త ములనురీతిని కవన రూపమున వర్ణించి తానానందము " ననుభవించుట యేగాక లోకము కొఱకు తన కాలసాంఘిక స్థితిని - దర్పణమ నఁజూపినట్లు చూపి యానందింపఁ జేయును. ఇట్టికవులు - సకల దేశములయందును' గలరు, ఎల్లకాలముల యందును గలరు: ఇట్టి గ్రంథము. లఖిల భాషలలోను