పుట:Srinadhakavi-Jeevithamu.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

276

శ్రీనాథకవి

ste

జమునఁ దగిన

మలంకరించిన విద్యాధికుడగు గోవిందయంచన శర్మను వాని సఖుడగు టిట్టిభ సెట్టిని నెత్తికొని భావగర్భితము సభివర్ణించి యెక్కువగా నపహసించి యుండుట నిజము. ఇందలి శృంగార రసము నీచమైనది, అశ్లీలమైనది. నీతి బాహ్యమైనది. స్త్రీలుసు, బాలురును జదువ దగిన గ్రంథము గాదు. కాని యీ గ్రంథ మాకాలము నాఁటి సాంఘిక చరిత్రమునకు

గొంతవఱకు విలువయైన వస్తు వస్తుసముదాయము నొసం

గుచున్నది. ఈ గ్రంధమును జదువు సప్పుకప్పటి సంఘస్థి యెట్లుం డెనో దాని స్వరూపము ముస కన్నులకు గోచరించు నట్లు కావ్వరూ పమున నంభివర్ణింపఁబడినది.


అందలి కథా సారము


ఒక నాడు కాసల్మాటి గోవిందమంచనశర్మ యను శోత్రియు బాహ్మణుడును, వాని చిఱుత కూకటి నాటి చెలికాడగు టిట్టిభ సెట్టియను కోమటియ, 'ఆంధ్రనగర 'మును నాంమాంతరముగల యోరుగల్లు నగర నీధులలో విలాసార్దము విహరించి యచట గోచరమగు వినోద ములను, క్రీడలను, ఆటపాటలను శ్రవనాసందకరముగఁజూచి యాసందించుటకై ప్రభాత వేళ నొక శుభ ముహూర్తమున బయలు దేఱును,

తొలుత ఏకశిలానగర వరిసరముననున్న వెలిపాళెమునం బ్రవేశించి యచటనున్న మేదర సానిని దర్వాత మొక చండాల యువతిని నాపిమ్మట నొక కర్ణాటాంగనసు వారు వీక్షించి శృంగార పరపశులై మోహావిభ్రాంతిఁ జెంది యటుపిమ్ముట నొక కొంతదప్వు మేర నొక కాపుపనితను, కర్ణాట వేశ్యను జూచుట తటస్థించెను. ఇట్లు వీరిని వీక్షించి పరమోల్లాసముననుండ సంపెంగనూనె నమ్ముచున్న యొక పడతి వారికంట బడుటయు నామె మేని యందము గాంచి యామె నట్టి దానిగా సృజించిన విధాతను దూఱుచు మోహరివాడలోఁ బ్రవేశించు టకై యగడ్తడను గడచి పైడితల్పులు బిగించిన వంక దారిగుండ' రాజ