పుట:Srinadhakavi-Jeevithamu.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవమాధ్యాయము

275


ఈ గ్రంధమునకుఁ బ్రతసపరుద్రుని కాలమున నున్న రావిపాటి త్రిపురాంతకుడను అప్ప రాజుచే సృస్కృతమున రచియింపఁ బడినప్రేమాభిదాభి రాము' మను గ్రంథము మూలమై యున్నది. దాని భాషాంతరీకరణ మిది యని యందు బేర్కొనఁబడినది. ఆ మూల గ్రంధమునేడు గాన రాదు, ఇన్యుది పదర్శనాను కూలనుగు నాటకముగా భాపాంతరీకరణింప బడక యేకాశ్వాసపు ప్రబంధముగా దెలిగింపఁబడినది. కావుననే యే వర్ణవము అధికముగ నున్న బ్రా, ఏయే వర్ణనములు భిన్న ములుగ నున్నవో తెలిసికొనుట కవకాశము లేదు, 'వీథి 'యనునది దశరూపములో నోకటియైన చిన్న నాటకము. ఒకరు గాని యిద్దకు గాని విలాసపురుషులను నాయకులు శృంగార విహారాసక్తులై యేదేని నొక నగరమునందును దప్పరిసర ప్రాంత ప్రదేశములందను సుచరింపుచు నందందుఁ గన్పట్టుచుండిన యాటపాటలను, ఉత్సవాది వినోదములను, కేళీవిశేషములను వీక్షించి సంతోష సాగరమునఁదేలుచు శృంర భోగ పరాయణులై వేశ్యావాకికాపరిభ్రమణమునకామాసక్త చిత్తులై యారాత్రి గడపి మరునాడు తనుదారెని పోవుచుందురు, ఇట్టి నాటికలకు 'వీథి ' యని మన పండితులు పేర్వెట్టిరి.ఇట్టివి సంస్కృతమునఁ బెక్కులు రచింపఁబడినవి. వానివలెనె రావిపాటితిప్పరాజు : ప్రేమాభిరామమును రచియించెను అయ్యది శ్రీడాభి రాముకును పేరితో దెలిగింపఁబడి వల్ల భామాత్య విరచితమై నట్టుగ వెలసి యున్నది. ఎంతకొట్టు మిట్టాడినను దీనికిని శ్రీనాథునకును గల సంబంధమును దొలగించుటకు సాధ్యము కాదు. తను కాలము నందు వీరేశలింగము పంతులు గారు వేశ్యాభుజంగులగు విద్యాధికులను గూర్చి తమ ప్రహసనములలో " తీవ్రముగఁ బరిహసించిన రీతినే యేనూజు సంవత్సరముల కిందట వల్ల భామాత్యుఁడు , గానిండు శ్రీనాథుఁడు గానిండు, ఎవరైన నేమి శిష్టాచార సంపత్తిలో నగ్ర స్థాన