పుట:Srinadhakavi-Jeevithamu.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

274

శ్రీనాథకవి


చెప్పినదేయని విశ్వసిచుట సాథ్యముగాదు. పయినుడివిన హేతువు లచేత ' (అక్ష్మయ్యుంబుగ) అను చాటు పద్యము శ్రీ నాథ విరచితము గాదని నేను దృఢముగా - నమ్ముకున్నాను.

వీథీ నాటకము


ఇందును , గూర్చి ప్రభాకర శాస్త్రి గారిట్లు వ్రాయుచున్నారు.


... శ్రీనాథకృతములును దదితర కృతములును నగు చాటుపద్య కొన్నింటిని జేర్చియచ్చు వచ్చిన తరువాత గొందఱు శ్రీనాథుని వీధినాటక' మను పేర నొక గ్రంథమును ముద్రించుచు పద్యసముదాయము ప్రాంతవ్రాత ప్రతు లలో గానరాదు. అట్టి పద్యములఁ గొన్నంటినీ జూటు వద్య మణిమంజరిలో నేను సంధానించినాఁడను శ్రీనాథుని వీధి నాటక మందలి పద్యంములు కొన్ని పబు పద్యసము దాయమునఁ జేరిన ననవచ్చును. కాని యూపద్య సముదాయమే శ్రీనాథుం వీథినాటకమనుట సరిగాదనినేను దలంచుచున్నాఁడను."

ఇట్టి ప్రభాకరశాస్త్రి గారి యభిప్రాయము తో నేను కూడా నేకీ భవించుచున్నాను గాని యిందేవి శ్రీ నాథునివో యేవి కావో నిర్ధారణ సేయుకుండ : శ్రీనాథుని శృంగారప్రవర్తన మిట్టిదని ప్రభాక రశాస్త్రి గారి వలే నా కవిసార్వభౌముని దూషించుట తగదని మాత్రము నేను చెప్పవత్తును.

శ్రీడాభిరామమే నిజమైన వీధి నాటక మనియు, అది శ్రీ నాథ విరచిత మే గాని వల్ల భామాత్య విరచితము గాదని శాస్త్రి గారి ధృఢ తరమైన యభిప్రాయము. ఇందున గూర్చియు మూడు పద్దతులు శాస్త్రి గారితో . నేనేకీభవింతును గాని యిది యాధార్థముగా , ధీసికొని శ్రీనాథునికి దుష్ప్రవర్తన యారోపించుటకు మాత్రము నామన సొల్లున్నది.