పుట:Srinadhakavi-Jeevithamu.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవమాధ్యాయము

273

డదేశమందలి నంబురాయుని కొడుకు తెలుంగు రాయడు అని చెప్పు యుండుట చేత నప్పటికి ఖ్యాతుఁడుగాక తండ్రి చాటు వాఁడనియు నిరువదేండ్లులో పడిన వయస్సు వాడయినట్లు తలుపవలయునని దృఢముగా విశ్వసించెడు ప్రభాకరశాస్త్రి గారు --


44. ధాటీ ఘోట ఘట్ట ఘట్టన మిళ ద్రాఘిష్ట కళ్యాణ ఘం
టాటంకార విలుంఠలుండిత మహోన్మత్తా హితకోణీ భృ
త్కోటీ'రాంకిత కుంభినీ ధరసము త్కూటాటవీ ఝూట క
ర్ణాటాంద్రాధిప! సాంప (సం] రాయని తెలుంగా! నీకు బహ్మా[దీర్ఘా]యునౌ


ఆసు పద్యమును జెప్పి శ్రీనాథుఁడు 'తెలుంగు రాయని దీవించిన వాఁడని యెట్లు చెప్పెసాహసింతురు ? అదియును గాక అశ్వారూఢుఁ డయి యయుద్దోన్ముఖుడై యున్న వాని నట్లు దీవించిన తరువాత ,కస్తూ రికా భిక్ష దానంబు సేయురా దాక్షారామ చళుక్య భీమవర గంధ ర్వాప్సరో భామినీ నక్షోజద్వయ . కుంభి కుంభముల పై వాసించు త ద్వాసవల్ అని ప్రశంసించు ? అహహా ! ఎటువంటి సమయము దొరకినది. ఇట్టి శాస్త్రిగారి విశ్వాసమును వివేకులెట్లు విశ్వసింపగలరు? రాచవేముని యనంతరము ప్రౌఢదేవరాయని పక్షమున నుండి కొండ వీటి సామాజ్యమును జయించి పాలించిన వారిలో నీ తెలుంగురాయని మొదట పేర్కొన వలసి యుండును. అందుచేత యాఅతని కర్ణాటాంద్రాదిప యని కవి సంభోదించు చున్నాడని తలంపవలయును. కనుక తెలుగు రాయని యాశ్రమము లభించిన మాట వాస్తవమే యగునేని నయ్యది క్రీ.శ.1420- 1426 సంవత్సరముల నడిమి కాలమయియుండును. అప్పటికి శ్రీ నాథుఁడు రాజను హేంద్రపురమునకు వచ్చి యుండ లేదు ప్రభాకరశాస్త్రిగారు తలంచి నట్లు శ్రీనాథునకు దాక్షా రామ రామసమాయోగము కల్గినదని తలంచుటకును సాధ్యముగాదు. కావున నీ రెండవ చాటుపద్యము శ్రీనాథుడు