పుట:Srinadhakavi-Jeevithamu.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

262

శ్రీ నాథకవి


పును నాత్మ గౌరవముతో గూడుకొన్న గాంభీర్య.. భావమును వెల్ల డించుచుఁ గవితాచాతుర్యము గలిమి చూపుచు దివిజ కవివరు • గుండి యల్ దిగ్గురనగ' సరుగు చునాఁడు శ్రీ నాథుడమరపురికి ". అని చెప్పిన పద్యమై యుండవలయునే గాని యేనబదేండ్లు నిండియు వైషయిక వాంఛల విడవజాలక వానికై యంగలార్చుచుఁ జచ్చు చున్నపు' డు భావిప్రపంచమున కుహనావి కుర్శకులు దన్ను నోటికి వచ్చినట్లు గా డిట్టుటకై చెప్పిన పద్యము గాదని కవితావాసన యించుక యేని గలవారికి బొడగట్టక మానచు


నవమాధ్యాయము.


శ్రీనాథుని ప్రవర్తనము


మా మిత్రులగు శ్రీయుత వేటూరి ప్రభాకరశాస్త్రి గారుతమ శృంగార శ్రీ నాథమను గఁథమున శ్రీవీరేశ లింగము పంతులుగారీ సందర్భమున శ్రీనాథుని గొంత' యవగణిచిరి. అతఁడు వార్ధకమున దారిద్ర మనుభవించుట పాపఫలమని కర్మ పాకము చెప్పిరి, అట్లు చెప్పుట వారికే చెల్లినది.” అని వ్రాసి వారి యభి ప్రాయము దాము గుర్హించినట్లు,తోప జేసిరి. ఎద్దానిఁబుక్రస్కరించు కొని వీరేశలింగము - పంతులవారట్లు '.. వ్రాయసాహసించిరో యద్దానినే మాశాస్త్రుల వారును బల పఱుచున్నారు. వీరివ్రాత వైఖరిని.. చూ డుడు