పుట:Srinadhakavi-Jeevithamu.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆష్టమాధ్యాయము

261


ములలో గూడ గలవనియు,ఇంతగా నధిక్షేపించెడు వీళేశలింగముగారి గ్రంథములనుండియు నెత్తి చూపించవచ్చుననియు విశదపఱచుకొనుచున్నాను.


ఎట్లయినను అవసాస కాల మాసన్న మగునప్పటికి మనకవిసార్వ భౌముడెనుబది సంవత్సరములు వయస్సు గలవాడై యున్నట్టు యొప్పు కొనక తప్పదు 1447 వ సవత్సరము నాటికి రాజమహేంద్రపు రాజ్యము గజపతుల యధీనమై పోయినది. శ్రీ నాథునకాంధ్ర ప్రభువుల ప్రాపు తొలగిపోయినది. తరువాత నొకటి రెండు సంవత్సరములు డాటిన వెనుకనే 1450 సంవత్సరముల ప్రాంతమున డెబ్బ దేండ్ల ప్రాయమునాఁడు గత్యంతరము లేక బొడ్డుపల్లెను గుత్త కు దీసికొని వఱదలు మొనలగు వానివలన పంటలు నాశనము కాగా గుత్త పైకమునుగూడ చెల్లింప లేక నర ప్రభువులవలన మొదటి పద్యములో జెప్పఁబడినట్టు నానావిధకష్టములు పొందియుండి యాపద్యసును జెప్పి యుండను. దీని దైవికముగా భావి పవలయునే కాని స్త్రీలోలుఁడై వయః కాలమున విచ్చలవిడిగాఁ దిరిగి కాయమును ధనని కాయమును జెడ గొట్టుకొని వృద్ధదశను దెచ్చుకొస్న పాపఫలనుని నిందించివ్రాయుట యెట్టివారికిని ధర్మమును గాదు; న్యాయమును, నీతియునుగాదు.

ఈ పద్యము చెప్పిన వెనుక మఱికొన్ని సంవత్సరములయినను బ్రతికి యుండడ వలయును. ఇతడు 1460 వఱకు బ్రతికి యుండ వలయునని నేనభిప్రాయపడుచున్నాను,


ఇట్లు నలుబది సంవత్సరముల కాల మఖిండ వైభవ , మనుభ వీంచి 'కాలకర్మదోషమువలన దారిద్రము పాలయి ". యెనుబదేండ్ల 'ప్రాయమున బ్రాణములు విడుచుచు శ్రీనాథుఁడు కనిసౌర్వభౌముఁ డు" గావున దన తొల్లింటి వైభవమును నప్పటి కష్టస్థితిని సూచిం