పుట:Srinadhakavi-Jeevithamu.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

258

శ్రీనాథకవి


వియు లేవు ... ... ఈ యసభ్యత గ్రంథము యొక్క కర్తృత్వము నూరాక యారోపించి మనవారు కొందు శ్రీనాథుమి ముంపఁ దలచుకొన్న దుర్యశః పంకము నుండి యక్కడి శ్రీ నాథకవి కృతము గాదని సిద్ధాంతమై సప్పుడే లేచి నిలఁబడి గట్టెక్కి కృతార్థుఁడు కాఁగలుగును : అని కంఠోక్తిగా వీథి నాటకము శ్రీ నాథవిరచితము కాదని సిద్ధాంతీ కరించియు "తమగ్రంధములలోని శృంగారమును, దుర్వర్తన ప్రకట టనముకును, 1: వీధినాటక ములోని (శ్రీనాథుని దానివలె దుర్జయపోషణ మునకును నీతిభంజనమునకును గాక దుర్జయశోషణమునకును దుర్నీతి భంజనమునకును , ఉద్దేశింపఁబడె'నని వ్రాసి వీధి నాటకము కారణముగా జెప్పుట స్వవచన వ్యాఘాకము కాదా? శ్రీనాథుని , జారుడఁ నుటకు సాక్ష్యము గలదా? వారు వీరు వ్రాసినారని యదియొక. ప్ర మాణముగాఁ గైకొనుట శాస్త్రీయ ధర్మమగునా? 4, ఇతడు శివభక్తుడు యావనదశ యందు శృంగార నాయకుడై స్త్రీలోలుడై తిరిగెని చెప్పదురు. అదంతయు నిజమ్మోకాని వయసు ముదిరిన తరువాత శివభక్తుడై యుండెనని యాతడు రచించిన గ్రంథములే సహసముఖముల ఘోషించుచున్న వి., అని పంతుల గారు తాము వ్రాసిన వాక్యములలో శ్రీనా థుని యౌవనదశను - గూర్చి తమ కేమియుఁ దెలియదని యొక మూల ఘోషింపుచు " స్త్రీలోలుఁడై వయః కాలమున విచ్చలవిడిగా దిరిగి కాయమును ధననికాయమును జెడగొట్టుకొని కష్టపడవలసిన వృద్ధదశ ను దెచ్చికొన్న పాపి యని సిద్ధాంతీకరించుట శ్రీనాథకవి సార్వభౌము నిపట్లఁ జూపు దౌర్జన్యమని వేనోళ్లఁ జూటకుండునా? వీరు క్రీడాభిరామ ముం సయితము శ్రీనాథకవి విరచితము కాదని చెప్పుచున్నారు. శ్రీనాథు నిపై మోపఁబడిన దోషము స్త్రీవర్ణననములు చేసినందులకును విటపురుషుల దిర్వర్తనముల వెల్లడించినందులకు కాదట. 'ఇంకెదులకందురా? శ్రీనాథుడు వేశ్యాజనవర్ణ నకుజనవర్లనము విశేషముగాఁ జేసినం