పుట:Srinadhakavi-Jeevithamu.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

248

శ్రీనాథకవి

బాలించుటకు గణదేవుఁడు నియమింపఁబడెను. వినుకొండ రాజ్యమును కమ్మ సేనాని సాగిగ న్నమనాయఁడు గన్న క్షితిపాలుఁడు పరిపాలనము సేయుచుండెను. ఉదయగిరిరాజ్యమునుమ ధవవర్మకులోద్భవుండయిన తమ్మిరాజపుత్రుడు బసవ రాజు పరిపాలనము సేయుచుండెను. వీరెల్లరును 1450 దవ సంవత్సరమునకుఁ బూర్వముననే యీ దేశము లను జయించి పరిపాలించుచున్నట్లు శాసనములవలనఁ దెలియవచ్చు చున్నందున నప్పటికే యాంధ్ర దేశములో మూఁడువంతులు గజపతుల స్వాధీనమయ్యెనని చెప్పవచ్చును.

శివరాత్రి మాహాత్మ్యము*[1]


ఇంతవఱ కువలబ్ధములయిన శ్రీ నాధుని గ్రంథములలో శివరాత్రి మాహాత్మ్యము గడపటిదిగాఁ గన్పట్టుచున్నది, రాజమహేంద్ర పుర రెడ్డి రాజ్యము నశించిన వెసుక వచ్చిన యొడ్డ రాజుల దొరతనమున శ్రీనాథకివిసార్వభౌముని నాదరించు ప్రభుపుంగవులు లేకపోయిరి. 1450 సంవత్సరమునకుఁ పిమ్మట శ్రీనాధకవిసార్వభౌముడు మరల దేశాటనము ప్రారంభించి కొండవీటి సీమలో సంచారము సేయుచు శివరాత్రి పర్వకాలమున శ్రీగిరి మల్లి కార్జున భ్రమరాంబికల సందర్శిం చుటకై శ్రీ శైలయాత్రకు బయలు వెడలెను శ్రీశైలమున బిక్షావృత్తి మఠమను జంగమ మఠ మొకటి గలదు. అక్కడ నా మఠాధీ శ్వరులు ధర్మకర్తలుగా నుండిరి. వారు శ్రీ నాధకవిసార్వభౌముని సత్కరించి శివరాత్రి మాహాత్మ్యమును జెప్పగోరినందున నతఁ డీ

గ్రంథమును రచియించెను.

  1. * ఈ గ్రంధ మాంధ్ర సాహిత్యపరిషత్తువారి చే సంపాదిత మై వారి యాంధ్రసాహిత్య పరిషత్పత్రిక యందే ప్రకటింపఁ బడియున్నది. ఆద్యంతము శిథిలమైనప్రతి యొక్కటియే దొరకినది. గ్రంధపాతములు గలవు.