పుట:Srinadhakavi-Jeevithamu.pdf/25

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
18
శ్రీ నాథ కవి


మణి యీకృష్ణ పట్టణమునకు ప్రభునిగాఁ గాకతి సార్వభౌముఁ డైనరెండవ ప్రతాపరుద్ర దేవునిచే నియమింపఁబడి యుండు వచ్చును. మనుమ సిద్దిరాజు కాలముసనే యీ దేశమంతయును గాకతీయాంధ్ర చక్రవర్తులకువశ్యమైనది. ఆంధ్ర చక్రవర్తిని యైన రుద్రమ దేవి "కాలముననే కాకతీయులపక్షమున నధికారు లీదేశమునకు నియమింపఁ బడుచు వచ్చిరి.కావున రెండవ ప్రతాపరుద్ర దేవుఁడు ముఖ్యమైన వర్తక స్థాన మగుట చేత మన కమలనా భామాత్యునిఁ గృష్ణ పట్టణమునకు సర్వాధికారిగ నియమించి యుండును.కమలనాభుఁకుద్యోగపడవియందుండుటమాత్రము చేతనే గాక మహావిద్వాంసుడై పండితకవియై పద్మపురాణాది కావ్వయ ప్రబంధములను రచించి యాసార్వభౌమునకు నంకితము గావించి యాతనిచే విశేష గౌరవ సమ్మానములను బొంది దేశమునఁ ఖ్యాతి గాంచి యుండవచ్చును. అందు చేతనే వినమత్కాకతిసార్వభౌము' సని ప్రస్తుతించి యుండును. ప్రతాపరుద్రుఁడు కమలనాభుఁడు తన రాష్ట్రము లోని యొక చిన్న యధికారియైనను, మహావిద్వాంసుడును, కవివర్యుడును, మఱియు విశేషించి బ్రాహ్మణుఁడు నైనందున నాకాలపు మర్యాద సనుసరించి పై విధముగా సమ్మానించె ననుట యొక యాక్షేపణీయాంశము గాదు.


ఇంకొక సంగతి జ్ఞప్తియందుంచుకొన వలయును. కొల్లతురై యనునది యఱవలు పెట్టిన నామముగా నుండెను. తెలుఁగు వారు కృష్ణపట్టణమనియే యప్పటినుండి యిప్పటి వఱకును వ్యసహరించుచున్నారు.గండగోపాలుఁడను బిరుదము వహించిన చోడరాజుచే నభివృద్ధికి గానిరాఁబడినది గావున గండ గోపొల పట్టణమని నామాంతరము గూఁడఁ గిలిగియుండెనుగాని మఱియెండు గాదు.వినమత్కాకతి సార్వభౌము' ననుపాఠము ననుసరించుటవలనఁ గమలనాభుఁడు రెండవ ప్రతాపరుద్రుని కాలమున నున్న వాఁడని వేద్యమగుచున్నది. రెండవ ప్రతాపరుద్రసార్వ