పుట:Srinadhakavi-Jeevithamu.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథకవి

“ చిన్నారి పొన్నారి చిఱుతకూకటి నాడు
రచియించితి మరుత్త రాట్చరిత్ర
నూనూగు మీసాల నూత్న యావనమున
శాలివాహనసస్త శతి నొడివితి
సంకరించితి నిండు జవ్వనంబున యందు
హర్ష నైషధకావ్య మాంధ్ర భాష
జాఢ నిర్భరవయః పరిపాకమునఁగొని
యాడితి భీమనాయకుని మహిమా
బాయమింతకుఁ గై వాలకుండఁ
గాసికా ఖండమను మహాగ్రంథ మేను
దెనుఁగుఁజేసెదఁ గర్ణాటదేశకటక
పద్మవన హేళి శ్రీ నాథభట్టసుకవి.


ఇట్టి సంకల్పముతో గాశీఖండరచనమునకు దొరకొనుటను గర్ణాకర్ణి కావశంబున విని వీభద్ర సృపాలుం డొక్కనాడు-


  • నీత్రైలోక్యవిజయాభిదం బైన సౌధంబు

చంద్రశాలాప్రదేశంబునందు
సచిన సైన్యాధీశ సామంత సృపచార
సీమంతి నిజన శ్రేణి గొలువ
శాస్త్రమిమాంసయు సాహిత్యగోష్ఠియు
విద్వత్కవీంద్రులు విస్తరింప
గర్పూర కస్తూరికా సంకుళ దగంధ
పారసౌరభము దిక్పూరితముగ
నిజభుజావిక్రమంబున నిఖిలదిశలు
గెలిచి తను రాజ్య పీఠమెక్కించి నట్టి
యన్న వేమేశ్వరుని యంశ మాశ్రయించి
నిండుకొలువుండె గన్నుల పండువగుచు,,*

అట్టినమయమునఁ దమ్ముని యభిమత ' మెఱింగి యల్లాడ వేమ భూపతి శ్రీనాథకవి సార్వభౌముని రప్పించి సముచితాసనమునఁ గూర్చుండ నియమించి యీ క్రింది విధమునఁ జలికెను,