పుట:Srinadhakavi-Jeevithamu.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

236

శ్రీనాథకవి

.


సట్లు 'ఇమ్మను జేశ్వరాధములకిచ్చి" అను పద్యమును భాగవతమున జెప్పినా.డట ఇదియే నిజమైన యెడల వెంటనే చెంప పెట్టు పెట్టినట్లు: ఓయీ తేలివితక్కువ పెద్దమ్మా! రావు సర్వజ్ఞ సింగమ్మపాలుఁ డుంచుకొన్న లంజతోత్తు పై దండకము చెప్పి యాతని కంకితము చేసిన నీవా యిట్టి గర్వోక్తులు వచరించుట? నోరుమూయు"మని ప్రత్యుత్తర మిచ్చియుండఁడా? భాగవతము: కుఁ బిమ్ముటనే భోగినీ దండకమును రచించే నందురా కావ్యముల రచించి నరాంకితముఁ జేసిన నన్నయ, తిక్కన, యెఱన, శ్రీనాథదుల వంటి మహాకవులను, తత్కృతిపతులను వ్యర్థ వాగా డంబరముతో దూషించిన వాఁడు సాత్త్విసకృతి గల యుత్తము పురుషుఁ డెట్లగును? భోగినీ దండకరచన భాగవతమునకుఁ బూర్వము నందైనను బరము నందయినను భాగవతములోని పయి పద్యమును సమన్వయించుటకు సాధ్యము కాదే. ఇప్పుడైనను భోగినీదండకము కృత్రిమరచన మని నా మిత్రులగు శాస్త్రీగారు గ్రహింపఁగలిగిన యెడల నా పడిన ప్రయానము వ్యర్థము కాలేదని తెలంతును. భాగవతము రచించిన పోత నానూత్యుఁడు శ్రీనాథుని బావ యని కల్పించిన కథలన్నియు దాడును బొంగరము లేని యమ్మమ్మ కథలని గ్రహింతురు గాక. బమ్మెర పోతన శ్రీ నాధుని తరువాతి వాడు గాని శ్రీనాథునికి సనుకాలికుఁడు గాఁడు

శ్రీనాథుని భార్య తోఁ బుట్టిన వారిలోనొక పోతానామాత్యుఁడు గలఁడు,అతఁడు నాచి కేతూపాఖ్యానము రచించిన దుగ్గనామాత్యుని ' యన్న - యని సౌచి కేతూపాఖ్యానమున వక్కాణి పఁ బడియున్నది. ఆ పోతసొమాత్యుం డే య బమ్మెర పోత నామాత్యు డని భ్రమించి, పోతన, శ్రీనాథులు బావమరదులని యూహించి చమత్కారముగా గథలు గల్పింప బడినవి గాని, యవి సత్యములు గావు.