పుట:Srinadhakavi-Jeevithamu.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్టధ్యాయము

235


సుకొన లేక యిటీవల వారు పండితులు, కవులు మొదలగు వారెవరికీ దోచిన విధముగా వారు తమ తమ సింగన్నలకు 'సర్వజ్ఞ ' బీరుదము నంటఁగట్టుచు వచ్చిరి. అందువలన సత్యము మఱుగునఁ బడిపోయినది. కూచిమంచి తిమ్మకవి గూడ సింగక్ష్మాపరునికి సర్వజ్ఞు.బిదముఁ జేర్చుట వాడుకను బట్టియే గాని తెలిసి చేర్చినది కాదు." పూర్వము రేచర్ల వంశీయులు - రాజ్యము చేసిన దేశమంతయునునేఁడు నైజాము ప్రభుత్వము క్రింద నుండుట చేత వీరి కాలము శాసనములు గాని గ్రంథములు గాని మనకు లభించి యుండ లేదు, లభించినవి బహు స్వల్ప సంఖ్య కలవిగా నున్నవి. వీరల చరితము సుపూర్ణముగాఁ దెలియను రాకున్నది. అందువలన నిపుడున్న సాధనములతోనే మన యభిప్రాయములను దేల్చుకొన వలసివచ్చుచున్న ది. ఇప్పటి సాధనములను బట్టి సర్వజ్ఞ సింగమనాయని గుర్తింపఁ జాలము,భోగినీ దండకమును నమ్ముకొని చరిత్రముఁ గల్పించు కోనుట కుక్క తోకను బట్టుకొని గోదావరి యీద బ్రయత్నించి నట్లగును.ప్రభాకరశాస్త్రి గారు పోతనామాత్యుని కృతులు భాగవతము వీరభధ్రవిజయము భోగినీ దండకము నని మూఁడు కలవు." అనియు, భోగినీ దండక కర్త యీతఁడు కాఁడను వాదమెంతయు నసంగత మే; అనియు, భోగినీ దండకము కుమారాన్న పోతానేని కుమారుఁ డగు రావుసింగభూపాలుని పేరచింపఁబడినదని; అనియు,పోతానామాత్యుఁ డోరుగల్లు నివాసి గావుసని రావు సింగ భూపాలునికా యల్పకృతి యొసఁగుట యువనన్న మయ్యెను;' అనియు,వ్రాసిన చేతులతో నే "పోతనయైహి కేచ్ఛావిమః ఖుఁ డగుట నిక్కువము.సరకృతి యాతనిక సమ్మతము;" అనియు, “పోతనామాత్యుడు సొత్త్విక ప్రకృతిగల యుత్తమపురుషుడు. రాజాశ్రయాద్య పేక్షలులేనివాఁడు?' అని వాసిన వాక్యము లర్థము లో వ్యర్థ వాక్యపుంజుములని యనిపించు కొన వా? శ్రీనాథాదులకుఁ జుఱుకుమని తగులు