పుట:Srinadhakavi-Jeevithamu.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్టాధ్యాయము

233


సింగ భూపాలుడు భాగవత ముంకితమిమ్మని తన రాజ్యములోని వా డగుటచేత పోతన్నను వేధించి యుండును.అతడు నిరాకరించి యుండును . అందు పై కోపించి యతఁడు బలాత్కారముగాఁ గాని మాయో పొయము చేతగాని యాగ్రంథమును దెప్పించుకొని కొంత కాలము భద్రముగా దాచి యుంచపలెనను తలంపుతోనే మంచి లక్షణముగా వించి భూమిలోఁ బాతి పెట్టి యుంచియుండ వలయును. అట్లుగాని పక్షమున బమ్మెర పోతన మే వాని డౌష్ట్యమునకు వెఱచి వాని చేతఁబడ కుండ నుంచుటకై మంచిరతుణముతో దానిఁ దనయింట నొకమూల పాతి పెట్టి యుండవలయును? సింగగమ నాయఁడే యీదుష్కార్యము జరిగించి యున్న యెడల నతఁడు లోకనిందకు భయపడి తనకుఁగల్గిన యపయశస్సును భరింపఁజాలక గ్రంథమును బై టికీతీయుటయో లేక బమ్మెర పోతనయె సింగభూపాలుని మరణానంతరము బైటికి దీయుటయో తటస్థించినప్పుడు తాళపతముల నేకములు చెదలపా లై నశించిపోయి యుండును శిదిలములయిన భాగములను మరల రచించు కొనకపూర్వమే బమ్మెర పోతన యావిచాముతో నే మరిణించియుండును. అందు చేత నే శిథిలములయిన భాగముల నితర కవులుపూరించుట సంభ వించినది. సింగభూపాలు డీ గ్రంథమును బాతి పెట్టించలేదని తలంచినను వానికిని పోతన్నకును నడుమకొంత గ్రంథమునడిచి యుండును. సింగభూపాలుఁడు పోతన్నను గొంతవఱకు బాధించి యుండునని యొప్పుకొనక తప్పదు. కొక యున్న నిర్నిమిత్తముగా నిట్టి నింద లోకములో వ్యాపించి యుండదు. బమ్మెరపోతన వంటి భక్తా గ్రేసరుండు, శాంతిగుణ సంపన్నుడు తన భాగవతములో నావిధ ముగా రాజదూషణము చేసియుండఁడు. భావి కాలమున నిట్టి నింద నుండి తప్పించుటకై సింగమనాయని వంశీయు లెవ్వరో తరువాత భాగ వత తరచన ననుకరించి బోగినీ దండకమును రచియింపఁ జేసి యుందురు.