పుట:Srinadhakavi-Jeevithamu.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్టధ్యాయము

231


దండకము.ను. సింగపాలునకు జెప్పినాడన్న లోకమున బమ్మెర పోతన గౌరవమంతయు బొగ్గుపాలగుట సంశయము గల, పోతన గౌరవమెట్ల మంటఁగలసిన నేమి! భాగవతము పాతి పెట్టించి నాడను లోకనింద నుండి సర్వజ్ఞ సింగభూపులే దప్పించిక జూలును గదా! "శ్రీనాథునామకవి ప్రవరుడు " అను సమాస పదమును రెండు విధము లర్థమగునట్లు విడ దీయవచ్చు .. ఎట్లన; శ్రీనాఛ నామక ..విప్ర వరుడు; అని, శ్రీనాధనామ. కని ప్రవరుడు ; అవి: మొకటి. సంభావన కొఱకు వచ్చిన బాహ్మణుడని స్ఫురింపఁ జేయఁగలదు.ఆంధ్ర ప్రపం చమున వివిద్యజ్ఞనలోకమును పేరు మోసిన శ్రీనాథకవి సార్వభౌముని నా నాఁడు నీనాఁడు నెజుంగనివాడు గలరా ! శ్రీనాధనాథకవి ప్రవరుడని. దీని చెప్పనేల? ఇందలినా నామశబ్ద ప్రయోగము యొక్క స్వాకవ్యమును గ్రహింపుఁడు. మఱియు నా కాలమున సర్వజ్ఞ భూపుండు గానిండు, మఱి యేభూపుండు గానిండు శ్రీ మదాంధ్ర భాగవత గ్రంథాంకితమును బొందు టకై యమ్మహాత్ముని బమ్మెర పోతన్నను మనఃసంక్షోభము పాల్చఱచి కష్టములఁ బెట్టియుందురని విశ్వసింపవలసి వచ్చుచున్నది. ఇట్టి మన సంక్షోభమునఁ గ్రుంగిపోయి యమ్మహాత్ముఁడు తన్నెక్కడ విక్ర యించునో యన్న భీతిచేత నేడ్చుచు - భారతి ప్రత్యక్ష్య మైనటుల తలపోసి కొని పోత రాజు దృఢ చిత్తుఁడై చేతులు మోడ్చుకొని,

  • . కాటుక కంటినీ చనుకట్టుపయింబడ నేల యేడ్చెనో

కైటభదైత్యమర్ధమని గాద కోడల యోమద్ంబ యో
హాటక గర్బురాణి నిను నాకటికిం గొనిపోయి యల్ల క
గ్లాట కిరాట కీచకుల కమ్మఁ ద్రిశుద్ధిగ నమ్ము భారతీ.

అను పద్యమును జెప్పి యామె వోదార్చుచుఁ దన గ్రంథముల నరాంకి తము చేయనని ప్రతిజ్ఞ బూనుట సత్యమని చెప్పవచ్చును.

ఇట్టి శీలముచే మహా ప్రఖ్యాతిగాంచిన " బమ్మెపోతన సింగమనాయని స్థానకవి యని చెప్పుటకంటె సాహసకృత్యము