పుట:Srinadhakavi-Jeevithamu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాధ్యాయము

17


(శా. శ 1900) (క్రీ.శ.1278)వ సంవత్సరమునఁ బట్టాభిషిక్తుఁడైనటుల గూడూరు సీమలోని కృష్ణ పట్టణము శాసనముంబట్టి "దెలియుచున్నది. ఇతఁడు సింహాసన మెక్కిన రెండనయేఁటనే అనఁగా శా.శ.1211టవ సంవత్సరమున మీన మాసమున శుద్ధ దశమి గురువారమునాఁడు గండ గోపాలపట్టణమని మెడికొల్లిత్తు రై పట్టణమున నివసించునట్టి వర్తకులు తిరుక్కా వనమునందు సమావేశులై తాము చేసికొన్న యొడంబడిక ప్రకార మా రేవు పట్టణములో చేయ బడునట్టి యుఁదిగుమతి చేయబడునట్టియు బస్తాల యొక్క మదింపు విలువను బట్టిగొల్లితుం గ్రామములోని సిద్ధీశ్వరుని యాలయ నిర్మాణము కొరకును, ధూపదీప నై వేద్యాకొఱకును వినియోగించునటుల దాన సాసనము వ్రాయించిరి, ఆకాలమునందు కొల్లీతు " యనియు, గంగోపాల పట్టణ మనియుఁ బేర్కొనఁబడిన కృష్ణ పట్టణము గొప్ప రేవుపట్టణముగా నుం డెనని పై శాసనము నుబట్టి విస్పష్టమ గుచున్నది. పదునెనిమిది దేశములనుండి యైదువందల మంది విదేశవర్తకులును, ఆయానాడులనుండియు, పట్టణముల నుండియు వచ్చినట్టి వర్తకులును ఆ రేవుపట్టణమున నివసించు చుండిరని యాశానమునందుఁ జెప్పఁబడియుండుట చేతనే యాకాలమునందు కృష్ణ పట్టణము గొప్ప రేవుపట్టణముగా నుండెననియు, విదేశములతో విరివిగా వర్త క వ్యాపారము జరుగుచుండె ననియుఁ జక్కగా బోధపకుచున్నది. "

ఈకృష్ణ పట్టణమునే మనము కొల్పట్టణముగా నీకింది. హేతువులచే నిర్ధారణ చేయవచ్చును. కృష్ణ శబ్దమునకు నలుపనుగలదు. కాలశబ్దమునకును నలుపును సర్ధ ముగలదు. కాఁబట్టి కాలశబ్దమునకుఁ బర్యాయ పదముగా నెంచి కృష్ణ పట్టణమును కాల్పట్టణమనిపద్యములో వ్రాసి యుండును. తన శాతకమలనాభామాత్య చూడా