పుట:Srinadhakavi-Jeevithamu.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

230

శ్రీ నా ధ క వి


బుదసంహితుడు బమ్మెర పోతన సుకవి
యొన్న ..... కాలంబు లెఱు డనుచు
నజ్ఞ లోక కొందరాడుదు దామహాత్ము
కవిత కెందును లోపంబు కలగ దభవ.

అనుపద్యముల సుదాహరింపుచు సర్వజ్ఞ సింగభూపాలుని దుర్న యమును నెల్లడించియున్నాఁడు. సర్వజ్ఞ సింగభూపునకును పోతన శ్రీ నా థులకుఁ గలసంబంధ మూవిధమునఁ బయి పద్యములు దెలుపు చుండ వేంకటగిరి వారి వంశావళిలో

 సీ, క్షతిలోన సర్వజ్ఞ సింగభూపాలుడు
జలవై సన్నుత పారుచుండు
లలి కావ్య నాట కాలంకార చతురుండు
సకల శాస్త్ర విశారదుఁడు
పలనొప్ప సింగ భూపాలీ ను నామక
గ్రంథంబు రచియించెఁ గౌతుకి మున
మును భాగవతమును దెనుగున చేసినయట్టి
బమ్మెరపోతన బాగుమీఱ

గీ. తనకుఁ జెప్పిన భోగినీదండకమును
వెలయ శ్రీనాధ నామక విప్రపరుఁడు
కోరి చెప్పిన పద్యముల్ గొని ముదాప్తి ,
బెంపుతో వారిమన్నించి పేరుపడసె.

అనుపద్యమునఁ జెప్పినవిషయములన్నియు సత్యములుగావని తలంపు జనింపకమానునా! సర్వజ్ఞ సింగభూపాలుని దుర్నయకార్యమును గప్పి, పెట్టుటకును, పోతన శ్రీనాధుల కపయశంబును కలిగించుటకును సంక ల్పించి చెప్పిన పద్యమని దీనిఁ జదివినంతటనే తేటపడగలదు. ఎట్లన; భాగవతము రచించిన పిమ్మటనే భోగినీ దండకమును పోతన రచించి నాఁడని చెప్పుట యొకటి 'మును.. తనకు' అను శబ్దప్రయోగముల స్వారస్యమును గ్రహింపుడు. (ఇమ్మను జేశ్వరాధముల కిచ్చి" అను పద్యమును రచించి భాగవతము లోఁ జొప్పించిన బమ్మెర పోతన భోగినీ