పుట:Srinadhakavi-Jeevithamu.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్టధ్యాయము

227


ఇతని కాలమునుండి 'రాయ రావు' బిరుదము కేచర్ల వంశీయులకుఁ గల దనియు నంతకుబూర్వ మీబిరుదము 'వారిపూర్వుల కెవ్వరకు లేద నియు, పై శాసనములోని శ్లోకము ధృవపఱచు చున్నది.


ఈయన పోతనాయని కేసర్వజ్ఞ సింగభూపతి కుమారుడై యున్న యెడల తండ్రి యనంతరము కుమారులను రాజ్యమును బొందవలసి యుండగా నై డవతమ్ముఁడు కావుమాధవ రావు పరిపాలసము చేయుట యెట్లు సంభవించును?. దీనికి ప్రభాకరశాస్త్రి గారు ప్రత్యుత్తరము చెప్పలేదు . ఇంతీయ గాదు. కావుసింగక్ష్మాపాలుని పుత్రుడై మెతుకుసీమకు పరి పాలించిన యనపోతనాయనికి సింగమవీడు, అన్నమనాచుఁడు, వసంత నాయఁడు నని మూవురు పుత్రులు గల రనియు, వీరిలో జ్యేష్ఠుడే సర్వజ్ఞ సింగభూపతి యనియు వెలుగోటి వారి వంశ చరిత్రము నందు వ్రాసిన వెల్లాల సహసీవశాస్త్రిగారికి నైన ప్రత్యుత్తరము చెప్పి యుండ లేదు, 'రావుమాధవరావు (1430 సంవత్సర ప్రాంతమున రాచకొండ రాజ్య ముకు బరిపాలించుచున్నట్లు శాసనము లుద్ఘోషించుచున్నవి. అదియు నుంగాక భోగినీకండకమున సర్వజ్ఞ సింగమనాయని తాతయగు సింగమ నాయనికి " రావు " బిరుదమున్నట్లు గన్పట్టుచుండఁగా రసార్ణ వసుధాకర కర్త సింగమనాయఁడే యాసింగమనాయఁడనుటకు నతనికిఁగూడ ఈ రావు " బిరుదమున్నట్టు రసార్లవసుధాకరమునుండిగాని యాతఁడంకితముఁ బొందిన వని చెప్ప బడిన చమత్కారచంద్రిక నుండి గాని రుచర వ్యాఖ్యము నుండి గాని ప్రయాణముల నెత్తి ప్రభాకరశాస్త్రి గారు చూపింపవలదా! రాయరావు బిరుదమును సంపాదించిన వాడు, అతని కుమారుడగు మాధవ రావని యాతని భార్య నాగాంబిక వ్రాయించిన జాసనమునఁ గన్పట్టుచుండుట ప్రభాకరశాస్త్రీగా రేఱుగరా? ఆశాసన సమాచార ము సుగ్గడించినవారేకదా? దాని నేలవిస్మరించవలెను! ఇయ్యవి బుద్ధి మద గ్రగణ్యులగు ప్రభాకరశాస్త్రిగా రెఱుంగనవి కావు. ఇందుకు ప్రతిబంధ కముగ నొక గోప్ప సంగతి వారిమనంబునకు దట్టినది.