పుట:Srinadhakavi-Jeevithamu.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

226

శ్రీనాథకవి


గాక, పెదకోమటి రెడ్డి పుత్రుడైన అన వేన రెడ్డియని భావింపవలయును, దీనింబట్టి అనపోతనాయఁడు శ్రీ. శ.1420 వఱకు రాచకొండ రాజ్య మును బరిపాలించుచున్న వాఁ డనుట స్పష్టము. ఇతఁ డే కారణముననో కర్ణాటసామాజ్యమునకుఁ జేరిన గండికోట దుర్గమును ముట్టడింపఁగా మొదటి దేవరాయ మహా రాయనికి సామంతుఁడుగ నున్న పోలేపల్లి, బుక్క రాజను మహావీరుఁ డెట్లో యొక రాత్రి వేళ మోసము చేసి వచ్చి పెఁబడి యసపోతనాయని సంహరించెననియు, అనపోతనాయని తమ్ము డగు పీనసింగభూపతీ (వేదగిరిస్వామి లేక మెతుకు సీమ నేలు రావు సింగమ్మపాలుడు) తన బావమరిది యగు జూపల్లి కొండమనాయని వానిఁబట్టి తీసికొని రావలసినదని యాజ్ఞపింసఁగా నాతఁడు బుక్కా రాజు పై దండెత్తిపోవ నావార్త విని యాతఁడు పొడిచేటికోటలో దాగు కొనియె ననియు, కొండమనాయఁడు వానీ నోడించి బంధించి తీసికొని రాగా నాతఁడు శరణు వేడినందునఁ జంపక విడిచి పుచ్చెననియు వెలు గోటివారివంశ చరిత్రమునందు వక్కాణింపబడినది. కనుక అనపోతానా యఁడు కీ. శ. 1422--1423 ప్రాంతము వఱకు రాచకొండ రాజ్యమును బాలించినవాఁ డనుట సత్యమని తేలు చున్నది. తరువాత నితని యైదవ తమ్ముఁడగు (కడపటివాడు) రావు మాధవభూపొలఁడు రాచకొం కొండ రాజ్యమును బరి పాలించినట్లు వానియొక్కయు, వాని నీ భార్యయొక్కయు శాసనములు ఘోషించుచున్నవి. ఈ సంగతి మొడటనే తెలిపియున్నాను. ఇతఁడు 'రాయ రావు' బిరుదమును లోకమునందురూఢ పఱచిన వాడని 'వానిభార్య నాగాంబిక శాసనములోని యీకింది శ్లోకమువలనఁ దెలియుచున్నది.


 శ్లో. సూను స్సీజ్ఞపస్య తస్యశుభదీ స్ఫూగ్యపము పై జుసా?
కాంత్యాచంద్రసమః కలాభీరనిళం సన్మార్గసంపత్తి భిః
రమ్యో రాజ గావుమాధవనృపో రాజన్య చూడామణి
ద్యేనశ్రీనిది . రాయరావు బిరుదం రాగినేని మాఢీకృతం