పుట:Srinadhakavi-Jeevithamu.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

223

షష్టద్యాయము


డని వారి విశ్వాసము. ఆకృతులందు భర్త, పేరు కుమార సింగభూపుఁడని యుండెను. కుమారసింగ భూపుడని రసార్వసుధాకరమున గాన రాదు. కావున, “అనపోతనాయని గూ ర్చిపై జెప్పబడినన మధ్యములో “బిరు గధీనరుకై న సినసింగనరపతి చ్నెంన్నందు నేకాజు కంతండ్రి " అని యున్న యెడల చమత్కార చంద్రిక19క, అమర వ్యాఖ్యలలో బేర్కొన్న, బడిన కమార సింగభూపాలుడే -రసార్లవసుధాకర గ్రంథకర్త యగునన్న తమయూహకు బలము - నొసంగునను తలంపుతో నమార్పును గోరెను. పూర్వులు వ్రాచిన రేచర్లల వారి వంశచరిత్ర "ములలో బేర్కొనఁ బడిన యేసింగభూపాలునకు సర్వజ్ఞ బిరుదము గలదో వానినిను దించుట విమ ర్శకుని ప్రయత్నముగా నుండుననిగాని సర్వజ్ఞునిగామిం చుటకై యొక సింగమనాయని స్మరించి వంశకర్తృత్వమును గూడఁదలపై నిడుకొనుట విమర్శకుని ప్రయత్నముగా నుండ రాదు.. భోగినీ దండకములో నుదాహ రింపఁబడిన సర్వజ్ఞసింగ భూపలియు, వానితండ్రీగుమా రాన్నపోత నాయఁ డున, తాత, రావుసింగడు మానాధుఁడును మెతుకు సీమను బరిపాలించు వారని పూర్వగంథములును, వేలుగోటివారి వంశ చరిత్రయు నొకవంక ఘోషించుచుండగా నామిత్రు లా షయమును విస్మరించి రాచకొండ రాజ్యమును బాలించిన వారుగా నూహించుట యధార్థమునకు విరుద్ధ ముగా గన్పట్టుచున్నది. రసార్ణవసుధాకర కర్తయగు సింగమనాయని జ్యేష్ఠ కుమారుఁ డైన అనపోతభూపాలుఁడు రాచకొండ రాజ్యమును బరి పొలించినమాట వాస్తవము. ఇతఁడు బహమనీ సుల్తానగు ఫెరో జపాహ లక్ష సైన్యముతో దండెత్తి వచ్చి పానుగల్లు దుర్గమును రెండు సంవత్స రములు ముట్టడించియు వశ్యముఁ జేసికొన లేక కలరామున్నగు వ్యాధులు పీడింపగా విశేష సైన్యము హత మైపోవుటను దలపోసి తురక సర్దారు లెల్లరును పలాయను లై తమతమ జాగీరులకుంబోవ ఫెరోజిషాహముట్టడి వదలిఫోవలసిన వాఁడ య్యేనని ఫెరిష్టా రాసిన చరిత్రమును బట్టి