పుట:Srinadhakavi-Jeevithamu.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

222

శ్రీనాథకవి


ర్ణవసుధాకరాది ప్రాచీన గ్రంథములు సాధకము లగుచున్నవి." అని ప్రభాకరశాస్త్రి గారు పద్యము దిద్దు బాటు నొందవలసినదిగా నిరూపిం చిరి. అట్లు చేసినయెడల 'పయిపద్యమున 'బిరుదభీకరుఁడైన పినసింగ సురపతి యనపోత భూపతికొడుకగు రసార్ణవసుధాకరకర్త యగునని శాస్త్రీ యభిప్రాయము. ఏ మార్పులలో గడపటి కాని నేనొప్పు, కొనఁజలకున్నాను. రసార్ణవవసుధాకకర్త సింగ భూపకి కాని పినసింగ భూపతియని రసార్ణ వసుధాకరమున నున్నట్లు శాస్త్రి గారు చూపించ లేదు. అందుచే సీసములోని సైదవచరణమును పూర్తిగాఁ దొలగించు టకు మాటుగా నందలి ప్రథమభాగముగు 'చిరకీర్తియగు రావుసింగావశీళుండు ' అను దానికి నాఱవ చరణములోని రెండవ భాగముగు 'చెన్నొం నునే రాజు కన్న తండ్రి' యనుదానిని గలిపి,

>చిరకీర్తియగు రావు సింగావనీకుండు
చెన్నొందునే రాజు కన్నతండ్రి,

అని 'యేక చరణము గావించి నిలిపిన యెడ రసార్ణవసుథాకరములోని వంశమునకు సరిపుచ్చనగును. శాస్త్రి గారికిఁ గావలసిన దవియొక్కటి యెగాదు. సర్వజ్ఞులో గుర్తించుటకు భోగినీ దండకముకంటె మించిన ప్రమాణము మఱియొకటి గానరాదు. అయ్యది బమ్మెర పోతన రచిం చిన దైనను గాక పోయినను భోగినీ దండకము సర్వజ్ఞ సింగభూపకి కంకిక ము గావింపబడియున్నది గావున దానిని ప్రసూణముగా గైకొసం దలంచిరి. అందు సర్వజ్ఞ సింగభూపతి తండ్రి కుమారాన్న పోతనాధు. డనియు, తాత రావుసింగ క్షమానాధుఁడనియుఁ, జెప్పఁబడియుండుట చేత శాస్త్రి గారు రసార్ణ వసుధాకర గ్రంథకర్తయె రావుసింగక్షమా నాథుఁడని గుర్తింపఁదలఁచినారు. అందుకు శాస్త్రి గారి కొక చిక్కు గానుపించినది. రసార్ణవసుధాకర గంథకర్తయగు సింగభూపాలుడు విశ్వేశ్వరకవిపండిత కృతమగు చమత్కారచంద్రి కకునుఁ బొమ్మకంటి 'యప్పయాచార్య కృతమగు " అమరవ్యాఖ్య " కును భర్తయై యున్నవా