పుట:Srinadhakavi-Jeevithamu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

శ్రీనాథకవి


సాహసంబనికి నైన నొడిగట్టగల సమర్ధు లగుదురు దాదిభీశువు యెట్టు సాధ్యమగును? పాఠకమహాశయులారా! మేదియోనిశ్చయముగా నెవ్వరికిని దెలియదు. తెలియనప్పుడు మూహించిపింపవచ్చును. దోష మేమియును లేదు గాని కారణము చెప్పక పూర్వ పాఠముల నిష్టమునచ్చినట్లు మార్చుట మాత్ర మని సాహస మని నొక్కి వక్కాణింపఁదగును. మనము నిరూపించుటకు సాధ్యము గాక యున్నప్పుడు 'కాల్పట్టణము పూర్వసముద్ర తీరమునందు న్న యేపట్టణమునకో నామాంతరమై యుండునని యూహపుట్టకమా నదు. అట్టీయూహలు చేయునప్పుడు నిర్ణేతుకముగాఁ బూర్వపాఠము లను మార్పక వాని కనుగుణముగా నుండునట్లుమనము నిర్ధారణముచే యుట యధార్ధమునకు విరుద్ధముగాఁ గన్పట్టినను దోషదూషితముగాఁ జాలదు. ఆంధ్ర కవిచరిత్రకారుల పథకమును మనమవలంబించుట కా క్షేపము లేకయున్న పక్షముసఁ బూర్వపాఠములను మార్పుఁ జెందింప కయే కాల్పట్టణ మేదియో నిర్ధారణ చేయవచ్చును. ఎట్లన శ్రీనాథుఁడు పాకనాటి నియోగి కావున నాతని జన్మసీను పాకనాఁడని తలంచుట వింత సంగతి కాదు. కావునఁ గాల్పట్టణము పొకనాటి సీమలో నైనను, దానికి సమీపము నందైనను సముద తీరము నందుండునని యూహించుట య సంభావ్యముగాదు. నెల్లూరునకు సమీపమున సముద్ర తీరమున కృష్ణ పట్టణమనును 'రేవుపట్టణ మొకటిగలదు. అది పూర్వకాలమునండియు మోటుపల్లికిఁ దరువాత పేరు మోసిన "రేవు పట్టణముగానుండెనని శాసన ములం బట్టికూడఁ దెలియుచున్నది. ఇందును గూర్చియాంధ్రుల చరిత్రము లోని ద్వితీయ భాగములో రెండవ ప్రకరణమున నిట్లు వ్రాసియున్నాఁడను. “మనుమసిద్ధి రాజునకుఁ బిమ్మట సిద్ధి రాజుకొడుకగు రెండవతిక్క రాజు గద్దెయెక్కి నటులు గానుపించు చున్నది. ఈయిమ్మడి తిక్క.. రాజు