పుట:Srinadhakavi-Jeevithamu.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

218

శ్రీనాథకవి


అప్పటికీ వానికి గుమారుఁడు పుట్టినాడనుకొన్నను వాఁడు విద్యా బుద్ధులు నేర్చి స్వజ్ఞుడని ప్రఖ్యాతి కెక్కి పరిపాలనము చేయుటకు నిరువదిసంవత్సరములవాఁడైన నై యుండవలయును గదా. ఇన్ని యసం భవము లగువిషయముల నంగీకరించినను సర్వజ్ఞ సింగమభూపతికి నీరువ దేండ్లు ప్రాయము వచ్చునప్పటికీ శ్రీనాథుఁడు బ్రదికియుండెనా ? యోచింపవలదా! అనగా లక్ష్మణరావు గారి సిద్ధాంతము ప్రకారము 1445 లేదా1450 సంవత్సరమున శ్రీనాథుఁడు మరణముఁ జెందియుండెను. శ్రీ వీరే శలింగముగారి యభిప్రాయము ప్రకారము 1445 లేక 1450లోపుగా శ్రీనాథుఁడు మరణముఁ జెందియుండెను. కాబట్టి సర్వజ్ఞసింగ భూపతికి - 30 సంవత్సరముల వయస్సు వచ్చుచున్నప్పటికే శ్రీ నాథుఁడు స్వర్గస్థుఁ డయ్యెనని తేలుచున్నది. ఇదెంత హాస్యాస్పదమైన సిద్ధాంతము, ఇంతియగాక శ్రీవీరేశలింగముగారు శ్రీనాథుఁ డీపండిత ప్రభువునొద్దకు బోయి సన్మానముఁ బొందినది 1425 వ సంవత్సర ప్రాంత మని వ్రాయుట (పిచ్చ కుదిరినది రోకలి తలకుఁ జుట్టు, మస్నట్లున్న ది. అన పోతసింగమనాయని కొడుకగు వేదగిరిస్వామిని రావుసింగ భూపాలునిగ జేసినను మనసమస్య పరిష్కారము గాలేదు. శ్రీనాథుఁడు పదవతరము వాఁడైన సర్వజ్ఞసింగమనాయని సందర్శించుటయే హుళక్కి యని తేలుచుండఁగా,

క. సర్వజ్ఞ నామ ధేయము
ళర్వున కేరావునిగ జనపాలునకే
యుండెల్లును నితరుని
సర్వజ్ఞుండనుట కుక్క- సామజయను టే,

అసుపద్యమును శ్రీనాథుఁడు చదివెనసుట మొదలుగా గథలన్నియును దుడిచి పెట్టుకొని పోవుచున్నవి. పునాది లేని భవన ఎంతగానిలుచును? శ్రీనాథకవిసార్వభౌముని యొక్క. కీర్తిని నలుపుగావించుటకై యీకథలు గల్పింపబడి నవికాని మఱియొండుగాదు. ఈ రే చర్ల కుటుంబము వారి వంశవృతక్షమునందు వెలుగోటివారి వంశచరిత్రముసరిగాఁ గానంబడదు,