పుట:Srinadhakavi-Jeevithamu.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాధ్యాయము

215


ఈ రేచర్ల వంశమునకు మూలపురుషుడు బేతాళనాయఁడని యేత ద్వంశీయుల గాధలలోఁ గన్పట్టుచున్నను పూర్వుల శాసనములయందు పెన్నమనాయనినుండియే వంశము ప్రారంభము చేయబడుచువచ్చెను. రసార్ణవసుధాకర గ్రంధమున ఎఱ దాచానాయని నుండి వంశమెత్తుకొన బడినది. ఈసర్వజ్ఞ సింగమనాయఁడు బేతాళ నాయనినుండి పదవతరమువా డట! పదవ కరము సింగమనాయఁడు భోగివీడండకమును బట్టి రావుసింగ భూపాలుని మనుమఁడని స్పష్టపడుచున్నది గదా. ఆఱవతరము వారయిన అనబోత నాయఁడును, మాథననాయఁడును 1320 వఱకు బరిపాలనము చేసియుండిరి. అనపోతభూపతికి సింగభూపతి, శివభూపతి యను నిరువుకు కుమారులు, మాధవధూ పొలునకు దేవగిరీంద్రుఁడు మొదలగువారును జనించి రని రసార్ణవ సుథాకరమును బట్టి దెలియు చున్నది: వీరిలో జ్యేష్టుఁడగు సింగభూపతి (ఏఁడవతరము వాఁడు) రాజ్య భారమును వహించెను. ఇతఁడు 20 సంవత్సరములు అనఁగా 1400 వఱకుఁ బరిపాలన చేసి యుండవచ్చును. ఇతఁ డేరసార్ణవసుధాకర గ్రంథకర్త ఇతనికిఁ గూడ సర్వజ్ఞ బిరుదము గలదందురు. అదియటుండనిండు. ఇతనితమ్ముఁడు శివభూపతియని రసార్ణ పసుధాకర గంథమున బేర్కొనఁబడియుండెను. ఇతని కేధర్మానాయఁడని నామాంతరము గలదనియు, ఇతఁడే వెలుగోటివారివంశమునకు మూలపురుషుఁడనియు "నేద్వంశ చరిత్ర గ్రంథకర్తలు నుడువుచున్నారు. ఈయేడవతరము సింగమనాయనికి' అనపోతనాయఁడు, దాచానాయఁడు వల్ల భనాయఁడు, వేదగిరినాయఁడు, దామానాయఁడు, మాదానాయఁడు నను నొర్వురుపుత్రలున్నట్లుగా రసార్ణ వనుథాకర గంథమున –

"శ్లో. అనపోత దాచవల్లభ వేదగిరిస్వామి దానుమా దాభై ః"

అని వక్కాణింపఁ బడియెను.వీరిలోఁ గడపటి వాఁడై :మాదానాయఁడు అనగా రామమాధవరావు భార్య నాగా