పుట:Srinadhakavi-Jeevithamu.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

214

శ్తీనాథకవి


చంద్రిక యెనిమిది విలాసములు గలది. చమత్కార చంద్రిక లోనీ రెండుశ్లోకములనిం దుదాహరించుచున్నాను.

 క్మతీ భీమతకృతి చతురాయది చతురోదాంతనయోగుణో దాగా
ఇతి లక్షణకృతిరత్నం రచయే సింగ నృపగుణోదాహరణం

లో కేరాఘవపొండ వాడ్భుత కరా గ్రంథానుసంధాయినౌ
తాగ్రంథాగొవివతన్ముని ప్రణిహితా శ్రీసింగ భూపాళయః
యాయాగాదరణీయతం కృతధియాగంధోయనుస్మత్కృతీ
నాహం యద్యపితాదృశోన్మ్యయమమ సౌరాజాహి తాదృగ్గుణః

చమత్కార చంద్రికను గూర్చిన యీవివరము నెవరో యొక మిత్రుఁడు వ్రాసి పంపఁగా వారి పేరెత్తక మెల్లగా వీరు తమ గ్రంథమునం దెక్కించుకొనిరి. ఇది యెక్కడనుండి సంపాదించినారో, ఈవిషయమై తమకుఁ దోడ్పిడిన వారేవ్వరో తమ గ్రంథమునఁ బేర్కొ నుట వీరిధర్మము కాదు కాబోలు ఈప్రశంసను విడిచి పెట్టి శ్రీనాథునికాలమున నీతం (పదవతరము సింగమనాయఁడు) డున్నాఁడా, ఇతడెక్కడ పరిపాలనము చేసెననునది విచారింపవలసియున్నది.

ఇతని కంకితము చేయబడిన బోగినీ దండకములో నితఁడు రావుసింగవృపాలుని మనుమఁడనియు, కుమారాన్న పోతాసాయనికిఁ బోచాంబ యందు జనించిన పుత్రు డనియు వ్రాయబడియున్నది. ఇతడురాజమ హేంద్రపురమునందుండి రాజమహేందపుర రాజ్య మేలినట్లుగావేలుగోటి వారినంశ చరిత్రగంథకర్తలు మొదలగువారు కొండఱు వ్రాసియున్నారు. గాని యదిసత్యముగాదు. శ్రీనాథుని కాలమున మహేంద్రపుర రాజ్యము నేలినవారుర అల్లాడ రెడ్డి పుత్రులగు వేమారెడ్డియు, వీరభద్రారెడ్డియు సనీ శాససములవలనను శ్రీనాథుని గ్రంథములవలనను దేటపడుచున్నది. ఇతఁడు మెతుకు దుర్గముననుండి యా దేశమును బరిపాలించినట్టు గన్పట్టుచున్నది.