పుట:Srinadhakavi-Jeevithamu.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

శ్రీనాథకవి

మును రచించినారు. వీరికి సర్వజ్ఞ నామము పౌరుష నామ ధేయమై యున్నదని బొబ్బిలి సంస్థానాధిపతుల చరిత్రమునందు లిఖింప బయున్నది,

• ఈ ప్రభుండు విద్యావినోదములఁ గాలము గడపుచుండు వాఁడు. సంస్కృతమున బండితుడును గవియునై యుండి స్వయముగ... సనేక గ్రంధముల రచియించి పండిత కవుల విశేషముగ నాదరించి బహు ప్రఖ్యాతి గాంచె "నని రావు వంశీయుల చరిత్రమున వక్కాణింప బడియున్నది.

"సింగభూపాలుఁడు మహావిద్వాంసుఁడు; అందుచేత సతండు సర్వజ్ఞ సింగమనీడు (నాయఁడు) అని వ్యవహరింపఁ బడుచు వచ్చెను. ఇతఁడు వేంకట గిరి సుస్థానమునకు మూలపురుషుఁ డయిన 'బేతాళ నాయుడను నామాంతరముగల దేవి రెడ్డికి బదవతరమువాడు. ఈప్ర భువు సంస్కృతమున చమత్కార చంద్రిక యను సలం శాస్త్రమును జేసెను. దీనికి సింగభూపాలీయమని నామాంతరము గలదు" అని యాంధ్రకపుల చత్రమున నద్ఘోషంపఁబడినది. (పూర్వ గ్రంథము)

రసార్ణవసుధాకర గ్రఁథము బయల్పడు సంతవఱకు సర్వజ్ఞ బిరు దాంచితుఁడైన సింగమనాయఁడొక్కఁడేయనియు అతఁడు రేచెర్ల బేకి నాయనికిఁ బదవ తరము వాఁడని వ్యవహరింపఁ బడెడి సింగమనాయఁ డనియు నభిప్రాయపడి యున్నారు.

ఇప్పుడు వెల్గోటివారీ వంశచరిత్రమునందు రసార్ణ పసుధాకర గంధకర్త యని వ్యవహరింపబడెడి యేఁడవతరము సింగమనాయఁడు కూడ 'సర్వజ్ఞ బిరుద ముగలవాడే యని వక్కాణింప బడియెను. సర్వజ్ఞ బరుదము గలవా రిరువురున్నారని ప్రతిపక్షులు చెప్పుచున్నారు, "వాగెల్లరును శ్రీ నాధుఁడు సందర్శించినది పదవతరము వానివనిక యే