పుట:Srinadhakavi-Jeevithamu.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాధ్యాయము

211


అంకితుఁడైన న సింగ

నిండుకొలువు నెలకొని యుండి నీవు
సరస సద్గుణ నికునికులాంబ శారదాంబ

శ్రీనాథుఁడీ రావు సర్వజ్ఞ సింగభూపాలుని యాస్థానమునకుఁ పోయియుండిన కాలములో


క. సర్వజ్ఞ నామ ధేయము
శర్వునకే రావుసింగనే: జవ పొలున
యుర్వం జెల్లును నితరుని
స్వజ్ఞుండనుట కుక్క- సామజ మనుటే


అని రాజునుగూర్చి పలికెనఁట! సర్వజ్ఞ బిరుదాంకితుడైన సింగమకుదాం! నాయఁడెతఁడో, అతఁ డెక్కడ పరిపాలనము చేసెనో తెలిసికొన వలయుసనీ సత్యాన్వేషణ తత్పరుఁడైన నాయాంద్రుల చరిత్రములో విశేషముగాఁ జర్చించియున్నాఁడను. ఈతనింగూర్చి వేంకటగిరివారీ వంశావళిలో


“ సీ. క్షితిలోన సర్వజ్ఞసింగ భూ పొలుండు
బలవైరిసన్నుత పౌరుషుండు
లలిత కావ్య నాట కాలంలంకార చతురుండు
సకల శాస్త్రర్థ విశారదుండు
నలనొప్ప సింగ భూపాలీయ నామక
గ్రంథంబు రచియించె గౌతుకమున
మును భోగవతమును దెనుఁగు చేసినయట్టి
బమ్మెర పోతన బాగుమీఱ

గీ. తనకుఁ జెప్పిన భోగినీదండకమును
వెలయ శ్రీ నాథ నామక విప్రవరుఁడు
కోర చెప్పిన పద్యముల్ కొని ముదా స్తి
బెంపుతో వారి మన్నించి పేరువడసె.”

అనునొక పద్యము గన్పట్టుచుండెను.

“వీరనేక విద్యల సభ్యసించి యెల్లప్పుడు పండితులచేతం గవు జేతంబరి వేష్టింపఁబడి యుండువారు. 'సింగభూపాలీయ' మను గ్రం