పుట:Srinadhakavi-Jeevithamu.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథకవి

జూపినవిగాక పెక్కు.లందుఁ గన్పట్టగలవు. పైనిచూ పఁబడిన పదపద్య భావసామ్యమును బట్టి క్రీడాభిరామము వల్లభరాయ విరచితముగాక శ్రీనాథ విరచిత మేయని యెట్టివానికై నను దోఁచకపోదు.


అధ్యాయము 6

సర్వజ్ఞ సింగమనాయని సందర్శించుట.


అట్లు ప్రౌఢ దేవరాయమహా రాయలవారి యాస్థానమున నరుణ గిరినాథ కవిసార్వభౌముని ముద్భటవివాదమున నోడించి వాని విజయ డిండిమమును బగులఁ గొట్టించి వానికవిసార్వభౌమ బిరుదమునుజూఁఱ యామహా రాయని మౌక్తి కాగారములో స్వర్ణాభి షేకమహోత్సవమును బొంది కర్ణాటక పద్మవన హేళియై సకలవిద్యా సనాధుఁడై న శ్రీనాథకవి సార్వభౌముఁడు తరువాత కొంతకాలమునకు విద్వాంసుఁడై సర్వజ్ఞ బిరుదాంచితుఁడై ప్రఖ్యాతిగనుచున్న రేచర్ల సింహభూపతిని సందర్శింపఁ బోయే నట! అట్లు పోవుచు నాతని యాస్థానమున దనకు విజయము కలుగుటకై శ్రీనాథుఁడు శారదాదేవి నుద్దేశించి యిట్లు స్తుతించెనట.


సీ, దీనారటంకాలఁ దీర్ధమాడించితి
                దక్షిణాధీశు ముత్యాలశాల
'పలుకుతోడై తాంధ్ర భాషామహా కావ్య
                నైషధగ్రంధ సందర్భమునకు
బగులగొట్టించి తుద్భట విహదప్రౌడి
                గౌడ డిండిమభట్టు కంచుఢక్క
చంద్రభూషణక్రియాచూశక్తి రాయల యొద్ద
                బాదుకొల్పితి సార్వభౌమ బిరుద
మెటుల మెప్పించెదో నన్ను నింక మీద
                రావుసింగమహీపాలు ధీవిశాలు