పుట:Srinadhakavi-Jeevithamu.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దాహ కుండెక్కి విడిచిన వారువంపు
గొడమయును బోలి క్రీ.రా. 87


చుడాలకుల వరారోహవాహాకుం డెక్కి-
విడిచినవారు వంపుగొదమయుంబో లె శి.మా.396

ఉ. తియ్యనివింలో జోదు గతి దేవి చనుంగప నొత్తగిల్లి యొ
య్యొయ్యునపలక చక్కఁబడనొత్తెడుఁ జూచి తే పుష్ప బాణముల్
మయ్యెగ వ్రాసేఁ జిత్తం ముమాఁగిలి నూఁగిలి చిత్ర కారుఁడా
దయ్యము గాక వీని పసదావము టిట్టిభ వీనికిందగున్ , క్రీ.రా.192

తే, గీ, గించిన కడకంటి కొలఁ జూచి
వాడివాలిక పూందూ పువంక దీర్చు
బోరగి రతి దేవి పాలిండ్ల నొత్తగలి న
యించు విలుకాని వ్రాసినారిడుపునందు,
                                                                             శృం. నై.8-150. 2010

ఈపద్యమునకు మూలము నైషధమున గాన రాదు. ఇట్టి యపూర్వ
కల్పనలే శ్రీనాధుని ప్రతిభావి శేషమును 'వేనోళ్ళఁ జాటుచు నామహా
నీయుని యాంధ్రీకరణ పద్ధతిని వివరించుచున్నవి. మూలమునగాన రాని
యీభావసౌమ్యము నేమని చెప్పవలయు?

మఱియు

శా. పంచారించిన నీ పయోధర ములా స్ఫౌలింతునో లేఁత బో
మ్మంచుం గెంజిగురాకు మోవిణి సిధాత్వర్థం బనుష్టింతునో
పంచాస్త్రోపనిషద్ర హస్య పరమబ్రహ్మ స్వరూపంబు నీ
కాంచీదామపదంబు ముట్టుదునో యోకర్ణాటతాటంకినీ !

శ్రీనాథుని కవితారచనల నూధుర్యము నించుకయైన జనిగొన్న రసజ్ఞులగువారీ పద్యము శ్రీ నాథవిరచితమని గుర్తింపకుంధురా?