పుట:Srinadhakavi-Jeevithamu.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

202

శ్రీనాథకవి


రామగంథకర్తృత్వమును 'వల్లభరాయనికీ నిలుప 'సమర్థింపఁబూనువాడుగూడ లోకమునఁ బరహాసాస్పదుఁడు గాకమానఁడు. అట్లగుటనెఱింగియు విశ్వనాధశర్మగారు తగుదుననీ ముందుకు వచ్చుట వింతగా నున్నది. ఒకటిగాదు;రెండు కాదు; వందలకొలది నున్న వానిని సమర్థించు కెట్లు? ఇట్టి సందర్భమున యుక్తి ప్రయుక్తుల వలనఁ బ్రయోజన,ముండునా? పదసంవిధానమునందును, 'కారక ప్రయోగవైచిత్రి పద్యాప శ్రమ నిర్వాహములందును, అన్వయక మమునందును, ప్రతిపదమును శ్రీనాథుని జ్ఞప్తికిఁ దెచ్చుచుండఁ గాదనుటయెట్లు? సంస్కృత వాజ్ఞ్మయ మందును పూర్వకవుల పద్యములలోని భావములను, కూర్చును సర్వాచీనకవు లనుకరించుట సనాతన సంప్రదాయ మనవచ్చును. అది గంథ చౌర్యములోనికిఁ జేరదు. సందర్భము ననుసరించి దములకూర్పున మార్చుచూ, పూర్వకవి ప్రయోగములకు మెఱ గులు పెట్టుచు తరువా తికవులు తమ తమ కవితల వెలయింపఁ జేసి యు న్నారు గాని పద్యములకుఁ బద్యములే, పద్యములోని రెండేసి, మూడేసి పాదములను బదముల కూర్పునం దొకింతయు మార్చు లేకుండనే ప్రసి ద్ధాంధ్ర కవియు దొంగిలించి యుండలేదు. ఇది కేవలము దొంగతనము అని చెప్పరాదు. ఈగ్రంథ మామూలాగ్రము శ్రీనాథ రచనమనియె గన్పట్టుచున్నది

పదపద్యభావసామ్యములు

గీ. "గార్గ్యసిద్ధాంతమత ముషః కాలకలన
శకునమూనుట యుదే బృహస్పతిమతంబు
వ్యాసమతము మన ప్రసాదాతిశయము
విప్రజనవాక్య మగయం.. విష్ణుమతము,
గీ. గార్డ్యసిద్ధాంతమత ముషః కాలకలన
శకునమూనుట యది బృహస్పతిమతంబు