పుట:Srinadhakavi-Jeevithamu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

శ్రీనాథకవి


కాల్పట్టణ ప్రశంస.

కొల్పట్ట ణమనునది. పశ్చిమ సముదతీకమునందు గాక పూర్వ సముదతీరమునందే యుండవలయు నని నిర్ధారణ చేయఁగలిగితిమి కానీ కాల్పట్ట మిదియని గుర్తించి చెప్పుట మాత్రము సాధ్యముగాక యున్నది. దీనిం గుర్తించుటకై శ్రీవీరేశలింగముగా రొక యద్భుత మార్గముం బట్టిరి. కాల్పట్టణ ప్రశంస విద్యావినోదములలో నొకదాని గాఁ జేసిరి. చేతిలోనిపని గనుక వెనుకముందుఁ బాఱజూడక కాల్ప ట్టణ మనువానిని కాలుకాల్పట్టణము గాగా సవరించి శ్రీనాథు: డట్లే భీమఖండ ములోఁ జెప్పియున్నాడనిరి. అటుపిమ్మట గాల్పట్టగా న్వేషణకు, దొడంగి, యిట్లు వ్రాక్రుచ్చి యున్నారు.


“కాల్పట్టణమేదో క్రొత్త పట్టణము. ఒక వేళ నిజముగానేక్రొత్త పట్టణమై యుండవచ్చును. కొల్పట్టణము ప్రకాశించు పట్టణము . కొత్తది ప్రకాశించును గనుక కొత్త పట్టణ మనవచ్చును. వినయ త్కాకతి సార్వభౌము' సని చెప్పుటచేతఁ గమలనా భామాత్యుఁడు 1320 న సంవత్సర ప్రాంతమున కాకతి ప్రతాప రుద్రసార్వభౌముని కొల్పట్టణమునకు కరణముగా నుండి యుండును.

ఇట్లు శ్రీనాథుని చరితములో మొదటి ఫుటయుందు వ్రాసి యుండియుఁ జదునకుల మనస్సులను బాగుగాఁ బట్టి యుండ దను తలంపునఁ గాఁబోలు మఱి కొన్ని పుటలలో 'రెడ్ల చరిత్రమును జెప్పిన వెనుక మఱల నిట్లు వక్కాణించి యున్నారు.

ఈ కాల్పట్టణ మేదో తెలియదు; ఆ ప్రాంతములయందు బ్రసిద్ధి కెక్కిన మోటుపల్లి యను రేపుపట్టణ ముండెకు;గాని యది యిది కాదు. మోటుపల్లికి మొగడపల్లియని నామాంతరము గలదు. శాసనముల యందీ రేవుపట్టణము ముకుళ పురమని వాడఁబడినది. అనపోత రెడ్డి కాలమునందలి యొక శాసనములోని యీక్రింది శ్లోకములను జూఁడుడు.