పుట:Srinadhakavi-Jeevithamu.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

198

శ్రీనాథ కవి


యున్నారు.*[1] విమర్శకులకుఁ బ్రత్యేకము శ్రమ తొలగించుటకై విశే షముగాఁ బరిశోధనము చేసి పదపద్యభాపసొమ్యములు గల పద్యము లను శ్రీనాథకవి రచితములైన యితర గ్రంథములలోని పద్యములతో బోల్చి చూచుకొనుటకై క్రీడాభిరామమునుండి 'పెక్కు పద్యముల నెత్తి చూపి యున్నారు. కాని వ్యాసపీఠికలోని బుక్క రాయాదుల కాల - నిర్ణయమును గూర్చి చేసిన ప్రశంసలో నుదాహరించిన సంవత్సరము లన్నియు నిజమైన చరిత్ర కాలమునకు భిన్నములుగా నుండుటయే గాక రాజుల నామములు గూడ తప్పులుగా వ్రాయఁబడినవి. రాఘవా చార్యులుగారు విద్యాధికులయి యుండి చరిత్రము బాగుగాఁ దెలిసిన యీ కాలమునఁ గూడ నట్టి యాభాసచరిత్రమును . వెల్లడించుట చరి తజ్ఞులలో హాస్యాస్పదులగుటయే గాక చరిత్రమును దెలియనివారిని మాజు త్రోవలం బెట్టిన వారగుచున్నారు. తనకు చరిత్రము తెలి యనప్పు డావిషయమున మౌనము వహించుట గౌరవాస్పదమైన విషయము,

“ ప్రథమ దేవరాయ లనఁబడు హరిహరి రాయలు క్రీ. శ. 1425 నకుఁ బూర్వమునను, ద్వితీయ హరిహర రాయలు క్రీ. శ. 1425--1446 సంవత్సరములలోను రాజ్య మొనర్చినట్లు గర్ణాట రాజ్య చారిత్ర పరిశోధకులు వాసియున్నారు. ఇందు వల్లభరాయల తండ్రి ప్రధమ హరిహర రాయల యాస్థానమున రత్నభాండాగా రాధ్య క్షడైనచో కవియు క్రీ. శ.1450 ప్రాంతము " వాడగును. ద్వితీయ హరిహర రాయ లయినచో కవి క్రీ. శ. 1475 సంవత్సర ప్రాంతము వాడగును. అళియరామరాజు ముత్తాతయగు సోమభూపాలుని కంకిత మీయఁబడిన 'శ్రీ'ధరచ్చందమున (మంచనవింటినో యను క్రీడాభి


11

  1. *(1) 1927 సంవత్సరము, భారతీ సంపుటము ,4 సంచిక 4 చూడుఁడు. (2) అదేసంపత్సరము " " సంచిక 6 చూడుడు