పుట:Srinadhakavi-Jeevithamu.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాధ్యాయము

165


నీప్సితముగాంచు దిప్పమంత్రీంద్ర తనయ
ద్మామణివల్లభత్యుండహరహరంబు


ఆమంత్రి శేఖరుడు రావి పాటి త్రిపురాంత దేవుం డను కవీశ్వ
రుం డొనరించిన ప్రేమాభిరామనాటకంబు ననుసరించి క్రీడాభి రామం
బును రూపకంబు తెనుంగు బాస రచియించినవాడు.

గీ. ఆతఁడెంతటివాడుప్రేమాభిరామ
మనగ నెంతేటి యది దానిననుసరించి
వీధియమ రూపకము మది వెఱపు లేక
తిప్పవి:భ్పుల్లభుడెట్లు తెనుఁగుజేసె

ఈవిధముగా వల్లభామాత్యుడు తనకుఁదానే పొగడుకొను చుండుట శ్రీవీరేశలింగముగారికి వింతగాను, వెగటు గాను గనుబట్ట లేదు. ఆత్మ గౌరవముగల కవి యెవ్వఁడు నీరీతిగాఁ దన్ను బొగడుకొనియుండడు. ఎంతటి స్తోత్ర ప్రియుఁడైనను నీరీతిగాఁ బొగడుకొన్న లోకము నవ్వునని సిగ్గుపడకమానఁడు. కావున నీపొగడ్తలన్నియును మఱియొక కవివై యుండ వలయును. అట్టికవి శ్రీనాథుడే గాని మఱియన్యుఁడుగాడు. తమ కవిత్వ మును గొంచె మతిశయోక్తులతోఁ బొగడుకొన్న మడికి సింగన, సంకు సాల నృసింహకవి మొదలగువారిని స్వాతిశయముకలవారని నిందించిన వీరేశలింగముగాగు వల్లభామాత్యునిపట్ల మౌనధారణము వహించి మిన్నకుండుట సత్యాశ్చర్యకరముగా నున్నది. “ఈవల్లభరాయని కవి త్వము మృదుమధురపద గుంభనము గలదయి పౌఢముగా నున్నది కాని కొన్ని చోట్ల గ్రీడాభిరామములోని వర్ణనము లసభ్యములయి య శ్లోలములయి నీతి బాహ్యము లయి యుండుట చేత స్త్రీలును సొమా న్యజనులును జదువఁదగినది కాదు." అని మాత్రము వ్రాసినారు. మఱి యును “జారత్వము దూష్యముగాఁ బరీగణింపఁబడక శ్లాఘముగా నెంచఁబడెడు కాలమునందుఁ జేయఁబకిన గ్రంథ విషయము మనము కాలమును నిందింపవలసిన దేకాని కవిని గర్జింపవలసిన పనిలేదు.”