పుట:Srinadhakavi-Jeevithamu.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాధ్యాయము

163


వ్యాప్తములో నన్నడనుమాట యైనను అప్పకవి గ్రంధమువలన స్థాపింపఁబడుచున్న దనుక స్పష్టముగదా. వల్లభామాత్యుఁడు 1420 లో క్రీడాభిరామము రచించుచుండఁగా జూచినవాఁడగుటచేతనో తత్పద్యరచనమునం దాతనికిఁ దోడుపడియుండుట చేతనో శ్రీనాథుఁడు 1430 వ సంవత్సర ప్రాంతమున అనఁగా 10 ఏండ్లకుఁబిదపఁ దానురచించిన భీమేశ్వరపురాణములో సంస్కృత శ్లోకమును దెనిగింపుచు క్రీడాభిరామ ములోని “గార్గ్యసిద్ధాంత" మన్న పద్యములోని మూడు చరణము. నట్లే వేసియున్నాడట! ఆహహా' ఎంత చక్కగా నున్నది.భట్టుమూ ర్యాదులను గూర్చి వ్రాయు సందర్భమున సిద్ధాంత 'మేల పనికిరా దయ్యెనో! క్రీడాభరామపీఠికలో వ్యతిరేకోక్తులతోఁ దన్ను దాను పొగడుకొనియుండునా? వానినీక్రింద నుదహరించుచున్నాను. చూడుడు. "మనుజమాత్రుండె వల్లభామాత్యవరుండు అను తుది పాదముగల సీసపద్యము నిదివజుకె యుదహరించి యున్నాఁడను.

కం. ఆహరవథి సమయ నృత్య
త్తుహి నాంశుధర ప్రచార దూతాధ్రదునీ
లహరీభ్రమ సుమఘుమములు
వహియప్పయ వల్లభన్న వాగ్వైభవముల్.


కం. హాటకగర్భవధూటే
వీటి కర్పూరశకల విసృమర పౌర
భ్యాటోప చాటుకవితా
పాటనమగు ధఱణీ వల్లభన్నకు నమగన్.

కం. హల్లీసక నటనోద్భవ వల్లభహరీ కృష్ణకంఠ వనమాల్యమిళ ద్దల్లన్ సురభులు తిప్పయ వల్లభరాయయప్రధాన వాగ్వైభవముల్",

కం. అమృతరససమధన సంభవ

ఘుమఘుమమిళ ఫయః పయోధి కోహలము