పుట:Srinadhakavi-Jeevithamu.pdf/20

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
13
ప్రధమాధ్యాయము


నాటింటి వాఁడవను దానిలో బాకనాటి నివాసుఁడవని గాక పాకనాటి నియోగిశాఖలోని వాడవని యర్థమగు చున్నది. పాకనాఁటి నియోగిబ్రా హ్మణులాంధ్రులే గాని కర్ణాటకులు గారు; పాకనాఁటిలో నివసించు కర్ణా టకులు కన్నడిగ నియోగి శాఖపొరని శాసనమ లో వ్యవహరింప బడిరి. మఱియును శ్రీ నాధునిభార్య తోబుట్టిన వాడు దగ్గుఁబల్లి దుగ్గ యామాత్యుడు దగ్గుబల్లి తిప్పయామాత్యునకు ఎఱఱముకును బుత్రుడు; పోతనకు నెఱనామాత్యునకుఁ దమ్ముడు, దుగ్గయామాత్యుఁడు నాసి కేతూ పాఖ్యానము నాంధ్రము నరచించి యాదగిరి పాలకుడైన బసవ భూపాలుని మంత్రి , యైన చిట్టిగంగనామాత్యున కంకితము చేసియున్నాడు. శ్రీనాథునకిట్టి బాంధవ్యము లాంధ్రులతోఁ గన్పట్టుచుండగాఁ గర్ణా టకుడని లేనిపోని సిద్ధాంతములఁ జేయుటకు ప్రయత్నించుట సమం జనము గాదు. ఉమాకాంతముగారు నుడివినట్లే శ్రీనాథుఁడు కర్ణాటక ఁ డేయై, కర్ణాట దేశముసందును, కర్ణాటభాషయందున , సంతటి యభి మానమే యున్న యెడల, నంతకాలము మహాపండితుఁడై , బతికియం డియుఁ, గర్ణాటరాజులతో. బరిచయము గలిగియుఁ, గర్ణాటం పద్మవన హేళియయ్యు, నొక్క. కావ్యమైనను, నొక్క.. పద్యమైనను, గర్ణాట భాషలో రచించియుండఁడా? ఏదీ యొక్క పద్యమైనఁ గానరాదే!


ఉమాకాంతము గారు తమపీఠికలో 'తల్లిదండ్రులతో నప్పుడప్పుడు మిశ్రమకర్ణాటమును మాట్లాడుచుండినను' అని యూహించి తమ చెవులతో నిన్నట్లుగావ్రాయుట మాత్ర మతి చిత్రముగా నున్నది. శ్రీనాథుఁ డింట మిశ్రమ కర్ణాటము వాడుచుండునో స్వశ్చమైన యాం ధ్రమును మాట్లా నుచుండునో ఏనూరుసంవత్సరములకుఁ బూర్వమున నున్న వాని కుటుంబ భాహవ్యవహారిస్థితి యెట్టిదో, వీ రేట్లు తెలిసికొన గలిగిరి! కాఁబట్టి ఉమాకాంతముగా యూహలు బ్రాంతిజనకము లని పై చర్యవలనఁ జదువరులకు బోధ పడక మానదు; గావున గ్రంథ విస్తరభీతివలస నీవిషయమును గూర్చినచర్చ నీఁక విరమిం చెదను,